Begin typing your search above and press return to search.

యంగ్ హీరో ఎకాన‌మీ క్లాస్ జ‌ర్నీ రియ‌ల్ హీరోని చేసేసింది!

By:  Tupaki Desk   |   20 Sep 2022 9:02 AM GMT
యంగ్ హీరో ఎకాన‌మీ క్లాస్ జ‌ర్నీ రియ‌ల్ హీరోని చేసేసింది!
X
సెల‌బ్రిటీ అంటే మంది మార్భ‌లం బోలెడంత హ‌డావుడి ఉంటుంది. ఏ ప్లైట్ ఎక్క‌ల‌న్నా? అంత‌కు ముందు కావాల్సినంత హంగామా చోటు చేసుకుంటుంది. బిజినెస్ క్లాస్ లోనే జ‌ర్నీ చేయాలి. కానీ ఈ యంగ్ హీరో వాటికి అతీతంలా క‌నిపిస్తున్నాడు. అవును బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.

ఇప్పుడున్న యంగ్ హీరోల్లో అత‌ని క్రేజ్ ప్ర‌త్యేకమైన‌ది. గాళ్స్ లో అత‌ని ఇమేజ్ ఎంతో స్పెష‌ల్. తాజాగా ఈ యంగ్ హీరో ఎకాన‌మీ క్లాస్ లో అంద‌రితో పాటు కలిసి జ‌ర్నీ చేయ‌డం విశేషం. జోద్ పూర్ నుంచి ముంబైకి ఈ ప్ర‌యాణం సాగింది. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. కార్తిక్ ఎకాన‌మీ క్లాస్ లో క‌నిపించ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌దుల్లేవ్.

అంతా అత‌నితో సెల్పీలు దిగారు. వీడియోలు సైతం చేసుకున్న కార్తిక్ ప‌ట్టించుకోలేదు. కార్తీక్ తోటి ప్ర‌యాణికుల‌తో స‌ర‌ద‌గా మాట మంతి చేసాడు.

ఓ స్టార్ హీరో ఇలా తోటి వారితో స‌ర‌ద‌గా ప్ర‌యాణించ‌డంతో వాళ్ల ఆనందానికి అవ‌దుల్లేవ్. కార్తిక్ రియ‌ల్లీ గ్రేట్ అంటు పొగిడేస్తున్నాడు. అత‌ను రీల్ కాదు..రియ‌ల్ హీరో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

బిజినెస్ క్లాస్ వ‌దిలేసి ఇలా ఎకాన‌మీ క్లాస్ లో జ‌ర్నీ చేయ‌డంతో అత‌ని డౌన్ టూ ఎర్త్ పాల‌సీని తెలియ‌జేస్తుందంటున్నారు. అంత‌కు ముందు కార్తీక్ ఎకాన‌మీ క్లాస్ లోకి వ‌స్తున్నాడ‌న్న విష‌యాన్ని తెలుసుకున్న కొంత మంది అభిమానులు ఆయ‌న్ని స్వాగ‌తించారు. ప్ర‌స్తుతం దానికి సంబంధించిన‌ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

వర్క్ ఫ్రంట్‌లో కార్తీక్ ఇటీవలే 'షహజాదా' షూటింగ్‌ను పూర్తి చేశాడు. 'షహ‌జాదా' చిత్రంలో కార్తీక్‌తో పాటు కృతి సనన్ ప్రధాన పాత్రలో కనిపించనుంది.

ఈ యంగ్ హీరో అనివార్య కార‌ణాల వ‌ల్ల ఇటీవ‌ల‌ ఓ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అత‌ని పై కొద్ది భాగం షూటింగ్ చేసిన త‌ర్వాత ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు. అందుకు గ‌ల కార‌ణాలు ఏంట‌న్న‌ది ఇప్ప‌టికీ సస్పెన్స్ గానే ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.