Begin typing your search above and press return to search.

ఓటీటీలోనూ 'కార్తికేయ 2' ప్రభంజనం..!

By:  Tupaki Desk   |   8 Oct 2022 5:35 AM GMT
ఓటీటీలోనూ కార్తికేయ 2 ప్రభంజనం..!
X
2022లో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాల్లో ''కార్తికేయ 2'' కూడా ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ కు చందూ మొండేటి దర్శకత్వం వహించారు.

'కార్తికేయ 2' చిత్రాన్ని ఆగష్టు 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల చేసారు. ఆ తర్వాత మలయాళంలోనూ రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ అనూహ్య స్పందన తెచ్చుకొని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భీభత్సమైన ప్రాఫిట్స్ రాబట్టింది.

ముఖ్యంగా నార్త్ సర్క్యూట్స్ లో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ వసూళ్లను అందుకుంది. కృష్ణతత్వం.. దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో రూపొందిన 'కార్తికేయ 2' చిత్రానికి తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారని చెప్పాలి.

బాక్సాఫీస్ వద్ద ఎపిక్ బ్లాక్‌ బస్టర్ గా నిలిచిన 'కార్తికేయ 2' సినిమా.. ప్రముఖ ఓటీటీ 'జీ5' వేదికగా డిజిటల్ రిలీజ్ కాబడింది. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ నుంచి తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేశారు.

థియేటర్లలో సత్తా చాటిన 'కార్తికేయ-2' చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోనూ సంచలనం సృష్టిస్తోంది. కేవలం 48 గంటల్లో 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ అందుకొని డిజిటల్ స్పేస్ లో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని జీ5 సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.

'కార్తికేయ 2' సినిమా బాక్సాఫీస్ సక్సెస్ తో పాటు అగ్ర దర్శక హీరోలు - సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకుల నుండి విస్తృతమైన ప్రశంసలు అందుకుంది. థియేటర్స్ లో ప్రభంజనం చూపించడం కాకుండా ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో ఆదరణ పొందడం విశేషం.

2014లో నిఖిల్ - చందూ మొండేటి కాంబోలో వచ్చిన సూపర్‌ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ 'కార్తికేయ' కు సీక్వెల్‌ గా ‘కార్తికేయ 2’ చిత్రం తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ - శ్రీనివాస రెడ్డి - ఆదిత్యా మీనన్ - వైవా హర్ష - తులసి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

'కార్తికేయ 2' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. వివేక్ కూచిభోట్ల‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. కాల భైరవ సంగీతం సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ నిర్వహించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.