Begin typing your search above and press return to search.
ఓ ఇంటివాడైపోయిన హీరో కార్తికేయ!
By: Tupaki Desk | 21 Nov 2021 11:33 AM GMTఈ మధ్య హీరో కార్తికేయ నిశ్చితార్థం జరిగింది. ఆ తరువాత 'రాజా విక్రమార్క' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనకి కాబోయే శ్రీమతి అని చెప్పేసి ఆమెను స్టేజ్ పైకి పిలిచాడు. ఆమె పేరు 'లోహిత' అనీ .. ఇద్దరం కలిసి ఇంజనీరింగ్ చేశామంటూ పరిచయం చేశాడు. వరంగల్ 'నిట్'లో చదువుతున్నప్పుడే తమ మధ్య పరిచయం జరిగిందనీ, ఆ పరిచయం ప్రేమగా మారిందని అన్నాడు. తాను హీరోను అయిన తరువాత తమ ప్రేమ విషయం ఆమె పేరెంట్స్ కి చెప్పి ఒప్పిస్తానని అన్నాననీ, అలాగే చేశానని చెప్పాడు. తనని హీరోగా నిలబెట్టిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.
అలా అప్పుడు ఒకే వేదికపై కార్తికేయను .. ఆయన కాబోయే శ్రీమతిని ప్రేక్షకులు చూశారు. ఆ రోజున కార్తికేయ చెప్పిన ముహూర్తం ప్రకారమే ఈ రోజున ఉదయం 9:47 నిమిషాలకు హైదరాబాదులో వారి వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. కాలేజ్ రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయిని, పెద్దల సమక్షంలో తన అర్థాంగిని చేసుకున్నాడు. ఈ వివాహానికి బంధుమిత్రులతో పాటు సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇక కార్తికేయ కెరియర్ విషయానికి వస్తే, కొంతకాలంగా ఆయనకి సరైన హిట్ పడలేదు. 'ఆర్ ఎక్స్ 100' తరువాత ఆ స్థాయి సినిమా పడలేదని ఇటీవల ఆయనే ఒప్పుకున్నాడు. అలాంటి హిట్ కోసమే వేయిట్ చేస్తున్నానని అన్నాడు. 'రాజా విక్రమార్క' ఆ స్థాయి హిట్ తెచ్చిపెడుతుందని ఆయన భావించాడు .. కానీ ఆ సినిమా కూడా ఆయనకి నిరాశే మిగిల్చింది.
ఫిజిక్ .. డాన్స్ .. ఫైట్స్ .. యాక్టింగ్ ఇలా ఏ విషయంలోను కార్తికేయకు వంక బెట్టలేం. విలన్ పాత్రలు చేయడానికి కూడా ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడు. సరైన కథలను .. ప్రాజెక్టులను సెట్ చేసుకోకపోవడం వల్లనే ఆయనకి హిట్ పడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరికీ మంచి గైడెన్స్ ఉంటుంది. ఎలాంటి కథను సెట్ చేసుకోవాలి? ఒక కథలో ఏమేం తక్కువపడ్డాయి? కథలో ఎక్కడ ఏం పడాలి? ఆడియన్స్ కి ఆ కథ కనెక్ట్ కావాలంటే ఎలాంటి మార్పులు చేర్పులు అవసరం అనే గైడెన్స్ చాలామందికి ఉంది. అలాంటి కసరత్తు కార్తికేయ విషయంలో లోపించిందనే టాక్ వినిపిస్తోంది. ఇకపై కథల విషయంలో మరింత కేర్ తీసుకుంటానని రీసెంట్ గా కార్తికేయ చాలా బలంగా చెప్పాడు. ఇకపై ఆయన నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి మరి.