Begin typing your search above and press return to search.

అయ్ బాబోయ్ ఆగ‌లేం రోయ్ వ‌చ్చేయండ్రోయ్‌..!

By:  Tupaki Desk   |   21 Dec 2022 2:56 PM GMT
అయ్ బాబోయ్ ఆగ‌లేం రోయ్ వ‌చ్చేయండ్రోయ్‌..!
X
కార్తికేయ గుమ్మ‌కొండ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `బెదురులంక 2012`. క్లాక్స్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందుల‌లో కార్తికేయ‌కు జోడీగా `డీజే టిల్లు` ఫేమ్ నేహా శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. లౌక్య ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై న‌వీంద్ర బెన‌ర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. రీసెంట్ గా ఫ‌స్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్ట‌ర్ నిరిలీజ్ చేసిన మేక‌ర్స్ తాజాగా బుధ‌వారం ఈ మూవీ నుంచి గ్లిమ్స్ ని `వ‌ర‌ల్డ్ ఆఫ్ బెదురులంక‌` పేరుతో విడుద‌ల చేశారు.

ఓ ప‌ల్లెటూరిలో 2012 యుగాంతం నేప‌థ్యంలో సాగే క‌థ‌గా `బెదురులంక 2012` చిత్రాన్ని ఓ విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిస్తున్నారు. తాజాగా విడుద‌ల చేసిన గ్లిమ్స్ వీడియోలో బెదురులంక గ్రామానికి చెందిన పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేశారు. విశాల‌మైన గోదావ‌రి తీరంలో ప‌చ్చ‌టి కొబ్బ‌రి చెట్ల మ‌ధ్య‌లో మ‌నుషులు.. బండిమీద దూసుకు వెళుతున్న కార్తికేయ‌.. ఊరు ఎలా వుటుందో వీడియో ప్రారంభంలో చూపించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

క‌ళ్ల‌కు క‌నిపించే విజువ‌ల్స్‌.. వినిపించీ వినిపించ‌ని డైలాగ్స్ .. బెదురులంక‌లో నిజంగానే ఏదో మాయ జ‌రుగుతోంద‌నే భ్ర‌మ‌ని క‌లిగిస్తున్నాయి. అయ్ బాబోయ్ ఆగ‌లేం రోయ్ వ‌చ్చేయండ్రోయ్‌.. అంటూ సాగే డైలాగ్స్‌.. గోదావిరి తీరంలోని టెంట్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ పై జ‌నం ఎగ‌బ‌డి తింటున్న తీరు... వ‌ర్షం ప‌డుతుండ‌గా ప్రేమ కోసం ప‌రిత‌పిస్తూ చేరువ‌వుతున్న ప్రేమ జంట‌...అజ‌జ్ఞ్ ఘోష్, కుమార్ క‌సిరెడ్డి, గోప‌రాజు ర‌మ‌ణ పాత్ర‌ల ప‌రిచ‌యం.. యుగాంతం వ‌స్తోంద‌ని ఊరిలో ప్ర‌జ‌లు అంతా ఎంజాయ్ చేస్తున్న తీరు న‌వ్వులు పూయిస్తోంది.
.
దాదాపు నిమిషం నిడివితో సాగే ఈ గ్లిమ్స్ స‌రికొత్త క‌థ‌తో కార్తికేయ వ‌స్తున్నాడ‌ని స్ప‌ష్టం చేస్తోంది. త్వ‌ర‌లో టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌తో పాటు సినిమాని రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. స‌రికొత్త నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ మూవీలోని ఇత‌ర పాత్ర‌ల్లో ఎల్బీ శ్రీ‌రామ్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, స‌త్య‌, సుర‌భి ప్ర‌భావ‌తి, కిట్ట‌య్య‌, అనితానాథ్‌, దివ్య నార్ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల్లో వున్న కార్తికేయ ఈ సినిమాతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌స్తాడేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.