Begin typing your search above and press return to search.
యువ హీరో భలే ప్లాన్ వేశాడుగా...?
By: Tupaki Desk | 22 Sep 2020 2:30 AM GMTయువ హీరో కార్తికేయ గుమ్మకొండ 'Rx 100' సినిమాతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో 'గుణ 369' 'హిప్పీ' '90 ML' 'గ్యాంగ్ లీడర్' వంటి సినిమాలలో నటించాడు. కార్తికేయ ప్రస్తుతం ''చావు కబురు చల్లగా'' అనే మూవీలో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవడం కష్టమే అని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.
కాగా, 'చావు కబురు చల్లగా' మూవీ కరోనా రాకపోయుంటే గీతా ఆర్ట్స్ 2 లాంటి పెద్ద బ్యానర్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి లాభాల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేసేవారు. అయితే ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఈ సినిమా థియేటర్ రిలీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో.. ప్రొడ్యూసర్ బన్నీ వాసు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేద్దామనే ఆలోచనలో ఉన్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అయితే హీరో కార్తికేయ మాత్రం ఈ సినిమాను కచ్చితంగా థియేటర్ లోనే రిలీజ్ చేయాలని.. అంతేకాకుండా తమిళంలో డబ్ చేసి విడుదల చేయాలని కోరుతున్నాడట. దీని వెనుక అసలు కారణం ఏంటంటే కార్తికేయ తమిళ్ మార్కెట్ పై ఫోకస్ చేయడమే అని తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ మూవీ 'వాలిమై' లో యువ హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడట. అందుకే గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ నుంచి తమిళంలో తన సినిమా రిలీజ్ అయితే అక్కడ కూడా తన మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చని కార్తికేయ భావిస్తున్నాడట. ఈ మధ్య యువ హీరోలందరూ ఇతర ఇండస్ట్రీలలో సత్తా చాటుతున్న క్రమంలో కార్తికేయ ప్లాన్ కూడా బాగానే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి 'చావు కబురు చల్లగా' సినిమాని కార్తికేయ కోరినట్లు రిలీజ్ చేస్తారా లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ కి పెడతారా అనేది చూడాలి.