Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ కోసం 'పలాస' దర్శకుడి మెగా వెబ్ సిరీస్..!

By:  Tupaki Desk   |   27 Aug 2021 12:30 AM GMT
నెట్ ఫ్లిక్స్ కోసం పలాస దర్శకుడి మెగా వెబ్ సిరీస్..!
X
'పలాస 1978' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కరుణ కుమార్. సమాజంలోని కులవ్యవస్థ.. దాని వల్ల అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ఈ క్రమంలో జరిగే తిరుగుబాటు వంటి అంశాలతో రా అండ్ రస్టిక్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకొని డైరెక్టర్ గా కరుణ కుమార్ విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు. తొలి సినిమాతోనే చిరంజీవి - అల్లు అర్జున్ వంటి సినీ ప్రముఖుల మన్ననలు పొందిన కరుణ కుమార్.. ఇప్పుడు రెండో చిత్రం ''శ్రీదేవి సోడా సెంటర్‌'' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

సుధీర్‌ బాబు - ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన 'శ్రీదేవి సోడా సెంటర్‌' సినిమా శుక్రవారం (ఆగస్టు 27) థియేటర్లలో విడుదల అవుతోంది. 'పలాస' చిత్రం కోసం శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్న కరుణ కుమార్.. ఈ చిత్రాన్ని గోదావరి జిల్లాలో సెట్ చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. టాలెంటెడ్ డైరెక్టర్ మరోసారి స్ట్రాంగ్ కంటెంట్ తో రాబోతున్నాడని అర్థం అవుతోంది. దీంతో ఈ సినిమా తర్వాత దర్శకుడు చేయబోయే ప్రాజెక్ట్ ఎంటనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో కరుణ కుమార్ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దీని కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. ఇది 20 ఎపిసోడ్స్ గా మెగా వెబ్ సిరీస్ గా రూపొందే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే తెలుగులో అన్ని ఎపిసోడ్స్ ఉన్న మొదటి సిరీస్ ఇదే అవుతుంది. కరుణ కుమార్ ఇంతకముందు 'మెట్రో కథలు' అనే ఒరిజినల్ సిరీస్ ని రూపొందించిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ ఆహా లో స్ట్రీమింగ్ అయిన ఈ ఫిల్మ్.. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కోసం కరుణ కుమార్ మరో వెబ్ సిరీస్ చేస్తారనే టాక్ వస్తోంది. ఇందులో నిజానిజాలు తెలియకుండా మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే మలయాళ హిట్ మూవీ 'నాయాట్టు' తెలుగు రీమేక్ బాధ్యతలు కూడా పలాస దర్శకుడు తీసుకోనున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.