Begin typing your search above and press return to search.
అల్లుడికి 'తొలిప్రేమ'ను ఇస్తాడా?
By: Tupaki Desk | 15 Aug 2017 4:52 PM GMTఎలాగొలా మంచి కాంబినేషన్ తెస్తే ఖచ్చితంగా సినిమాలు హిట్టవుతాయని ఒక నమ్మకం ఉంటుంది. అందుకే మన నిర్మాతలూ డైరక్టర్లూ చాలా కష్టపడి కాన్సెప్టులు కంటే కూడా కాంబినేషన్లను నమ్మకుంటారు. అలా నమ్ముకున్న చాలాసార్లు సినిమాలు హిట్టే అవుతుంటాయి కాని.. ఒక్కోసారి మాత్రం డిజాష్టర్లు వస్తుంటాయి. ఎందుకంటే కాంబినేషన్ ఎలా ఉన్నా కథ కూడా ముఖ్యం. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి ఒక కారణం ఉందిలే.
పవన్ కళ్యాణ్ ను అసలు టాప్ హీరో రేంజులోకి తొలి అడుగు వేసిన చిత్రం 'తొలిప్రేమ'. ఈ సినిమాతో పవర్ స్టార్ దిశాదశను ఒక కొత్త దర్శకుడు కరుణాకరన్ మార్చేశాడు. కాని ఆ తరువాత పవన్ కు ఖుషీ రూపంలో అలాంటి లవ్ స్టోరీ మళ్ళీ పడినా కూడా.. కరుణాకరన్ కు మాత్రం పడలేదు. అదే కరుణాకరన్ మరోసారి మెగా హీరోతో చేస్తున్నాడంటే భలే ఎక్సయిట్మెంట్ ఉంటుంది కాని.. బాలు అండ్ హ్యాపీ వంటి సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడం కాస్త నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు ఇదే కరుణాకరన్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమాను చేస్తున్నాడట. మరి మావయ్యకు తొలిప్రేమను ఇచ్చినట్లు.. చాలాకాలం నుండి హిట్టు కోసం కొట్టుమిట్టాడుతున్న మేనల్లుడికి ఒక హిట్టు చేతిలో పెడతాడా?
అప్పుడొకసారి హీరో రామ్ తో ఒక సినిమాను మొదలుపెట్టాడు కరుణాకరన్. ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకుని రామ్ తరువాత తిరుమల కిషోర్ డైరక్షన్లో 'ఉన్నది ఒకటే జిందగి' మొదలెట్టాడు. మరి రామ్ వద్దనుకున్న ఆ కథతోనే సాయిధరమ్ చేస్తుంటే.. అదొక సెంటిమెంట్ అవుతుందని అంటున్నారు సినీ జనాలు. ఎందుకంటే సుమంత్ రిజక్ట్ చేసిన కథనే పవన్ చేస్తే తొలిప్రేమ రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అదీ కత!!