Begin typing your search above and press return to search.
మన బంగారం ఉండగా ఆ చూపులు దండగే
By: Tupaki Desk | 1 Aug 2016 4:17 AM GMTటాలీవుడ్ జనాలకు ఈ మధ్య ఫారిన్ లొకేషన్లలో షూటింగ్ చేయడం ఎక్కువయిపోయింది. సినిమాలకు సినిమాలు పక్క దేశాల్లో చుట్టేస్తున్న బాపతు చాలానే వస్తున్నాయి. స్టోరీ-కాన్సెప్ట్ డిమాండ్ చేస్తే ఆ సంగతి చెప్పలేం కానీ.. అవసరం ఉన్నా లేకపోయినా విదేశాల్లో షూటింగ్ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. చివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ కోసం తనే హీరోయిన్ కాజల్ ని స్విట్జర్లాండ్ తీసుకెళ్లి పాట షూటింగ్ చేసుకొచ్చేశాడు.
రాబోయే రెండు వారాల్లో రెండు మెగా ఫ్యామిలీ మూవీస్ థియేటర్లలోకి వస్తున్నాయి. అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు కోసం టైటిల్ సాంగ్ ని కాశ్మీర్ లోని లెహ్ ప్రాంతంలో పిక్చరైజ్ చేశారు. ఇక సాయి ధరం తేజ్ నటించిన తిక్క చిత్రంలో వెళ్లిపోకే అంట సాగే సాంగ్ ను లడఖ్ లో చిత్రీకరించారు. కాశ్మీర్ లో పాటలు తీయడం మనోళ్లకు కొత్తేం కాదు కానీ.. ఈ రెండు పాటల్లో విజువల్స్ అదిరిపోయాయనే చెప్పాలి. స్విట్జర్లాండ్ కో మరో దేశానికో వెళ్లి షూటింగ్ చేసుకొచ్చిన వాటికి మించి గ్రాండ్ గా ఉన్నాయి.
ఈ పాటలు చూస్తుంటే బంగారంలాగా మన దేశంలోనే ఉన్న అందాల కాశ్మీరాన్ని వదిలేసి.. ఎక్కడో ఉన్న దేశాలవైపు చూసుకుంటూ అటు టైమ్.. ఇటు మనీ వేస్ట్ చేసుకుంటున్నారని అనిపించక మానదు. ఫారిన్ లొకేషన్లలో తీశామని గ్రాండ్ గా చెప్పుకోవడానికి తప్ప.. కాశ్మీర్.. లడఖ్..లలో తీసినవాటికంటే అవేం పెద్ద గొప్పగా ఉన్నాయో మేకర్స్ కే తెలియాలి.