Begin typing your search above and press return to search.
సిద్ధూతో 'బిచ్చగాడు' దర్శకుడి మూవీ!
By: Tupaki Desk | 17 Aug 2018 4:39 PM GMTసరైన కంటెంట్ ఉంటే చాలు....క్యాస్టింగ్ తో సంబంధం చిన్నసినిమానైన ప్రేక్షకులు ఆదరిస్తారని ఇప్పటికే చాలాసార్లు రిలీజైంది. ఏమాత్రం అంచనాలు లేకుండా....కేవలం కథా బలం - స్క్రీన్ ప్లే ను నమ్ముకొని విడుదలైన పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించాయి. రెండేళ్ల కిందట విడుదలైన ‘బిచ్చగాడు’ సినిమా నుంచి తాజాగా సంచలన విజయం సాధించిన `ఆర్ ఎక్స్ 100`వరకు అదే కోవకు చెందుతాయి. డబ్బింగ్ సినిమాగా ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన బిచ్చగాడు ...రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. హీరో విజయ్ ఆంటోనీ - దర్శకుడు శశిల కాంబోలో వచ్చిన ఆ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. అయితే, ఆ తర్వాత విజయ్ తన సినిమాలన్నింటినీ తెలుగులోకి డబ్ చేసినా... ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు, బిచ్చగాడు దర్శకుడు ఆ సినిమా తర్వాత వేరే సినిమానే చేయలేదు. తాజాగా, హీరో సిద్ధార్థ్ తో శశి ఓ త్రిభాషా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
బొమ్మరిల్లుతో మంచి పేరు తెచ్చుకున్న సిద్ధూ...కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ‘గృహం’ తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన సిద్ధూ పర్లేదనిపింపచాడు. ఇపుడు తాజాగా శశి దర్శకత్వంలో తమిళం - తెలుగు - హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న చిత్రంతో తన లక్ ను మరోసారి టెస్ట్ చేసుకోబోతున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ - హీరో జి.వి.ప్రకాష్ కుమార్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట. అన్నట్లు, దాదాపుగా 20 ఏళ్ల క్రితం శశి ఓ తెలుగు సినిమా చేసిన విషయం చాలామందికి తెలీదు. తమిళంలో తాను డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ ‘సొల్లామలే’ తెలుగు రీమేక్ ‘శ్రీను’కు కూడా శశినే దర్శకత్వం వహించాడు. ఆ చిత్రం వెంకీకి చేదు అనుభవం మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘బిచ్చగాడు’తో తెలుగు ప్రేక్షకులను టచ్ చేసిన శశి.....సిద్ధూతో ఎంతవరకు హిట్ కొడతాడో వేచి చూడాలి.