Begin typing your search above and press return to search.
కాష్మోరా తెలుగులోనే భారీ విడుదల!
By: Tupaki Desk | 25 Oct 2016 8:00 AM GMTప్రపంచీకరణ అనేది మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా సినిమాల విషయంలో మాత్రం సక్సెస్ ఫుల్ గా పనిచేస్తోంది. ఈ మధ్యకాలంలో సినిమా బాగున్నా - లేక భారీ బడ్జెట్ కేటాయించుకున్నా... ఆ సినిమాని వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించుకుంటున్నారు నిర్మాతలు. ఈ విషయంలో ఇప్పటికే బాహుబలి చేయాల్సిందంతా చేసింది. ఈ క్రమంలో "కార్తీ" కాష్మోరా ను కూడా ఎక్కువ థియేటర్లలలో విడుదల చేయాలని భావిస్తున్నారట. మిగిలిన చోట్ల సంగతేమో కానీ... ఊపిరి సినిమాతో ఫుల్ ఫాం లోకి వచ్చిన కార్తీని తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారనే నమ్మకంతో తెలుగులోనే ఎక్కువ స్క్రీన్స్ ప్లాన్ చేస్తున్నారట.
దీపావళికి తెలుగు సినిమాల రూపంలో పెద్దగా సందడి లేదు. మంచు లక్ష్మి సినిమా "లక్ష్మీబాంబు" మినహా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం ఈ దీపావళిని నిరాశే. ఈ క్రమంలో దీపావళి పండగను అత్యంత ప్రత్యేకంగా భావించే తమిళ జనాలు మాత్రం రెండు భారీ సినిమాలతో రెడీ అయిపోయారు. తెలుగు - తమిళం లలో రెండుచోట్లా ఆ హీరోలకు పేరుండటంతో... ఆ రెండు సినిమాలూ తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజవుతున్నాయి. అందులో ఒకటి కార్తి నటించిన కాష్మోరా అయితే.. ఇంకోటి ధర్మయోగి (తమిళంలో "కోడి"). వీటిలో కార్తీ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ అంచానాలే ఉన్నాయి.
దీంతో తెలుగులో ఈ చిత్రం భారీగానే రిలీజవుతోంది. అది కూడా ఏస్థాయిలో అంటే... తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసేటంత. అవును... తమిళనాట ధనుష్ సినిమా "కోడి" నుంచి తీవ్ర పోటీ ఉండటంతో తమిళనాడు మొత్తంలో ఈ చిత్రానికి 450 స్క్రీన్లే దక్కాయి. కానీ తెలుగులో మాత్రం ఏకంగా 600 స్క్రీన్లలో ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. మగధీర - యుగానికి ఒక్కడు - బాహుబలి తరహాలో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడం, సుమారు రూ.60 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించడం, తెలుగువారికి బాగా దగ్గరైన పీవీపీ సంస్థ ఈ సినిమాని నిర్మించడంతో... తెలుగులో కూడా భారీగా విడుదల చేయాలని నిర్ణయానికొచ్చారంట.
కాగా... ఈ సినిమాలో కార్తి మూడు రకాల పాత్రలు పోషిస్తున్నాడు. ముఖ్యంగా యుద్ధ వీరుడిగా గుండుతో ఉన్న క్యారెక్టర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. నయనతార - దివ్యశ్రీ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు గోకుల్ రూపొందించాడు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/