Begin typing your search above and press return to search.

మీడియాపై కస్సుబుస్సుమన్న కస్తూరి!

By:  Tupaki Desk   |   14 March 2017 1:51 PM GMT
మీడియాపై కస్సుబుస్సుమన్న కస్తూరి!
X
మాజీ హీరోయిన్ కస్తూరి 90వ దశకంలో బోలెడంత ఫేమస్. స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు విరివిగా వచ్చేసేవి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన ఈమె.. ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన క్యాస్టింగ్ కౌచ్ అంశంపై చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి.

నో అనే మాట వినడం ఇష్టం లేని ఓ హీరో.. తన నుంచి ఫేవర్ కోరుకున్నాడని.. తాను ఆయనతో ఒకటే సినిమా చేయగా.. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నాడని కస్తూరి కామెంట్స్ చేసింది. దీంతో.. కొన్ని మీడియా సంస్థలు.. ఫలానా హీరో అంటూ.. ఓ సీనియర్ స్టార్ పై బురద చల్లడం మొదలుపెట్టేశాయి. అయితే.. తాను చెప్పిన వ్యక్తి తెలుగు హీరో అనే మాటను కస్తూరి ఎక్కడా వాడలేదు. అయినా సరే.. ఒక మీడియాలో వచ్చిన వార్తకు.. చిలవలు పలవలు అల్లేసి మరికొందరు రాయడం మొదలుపెట్టేశారు. దీనిపై కస్తూరి ఇప్పుడు స్పందించింది. "ఒక వ్యక్తి ఎవడో అబద్ధాన్ని రాస్తాడు. ఇక ప్రతీ ఒక్కరూ అదే అబద్ధాన్ని పట్టుకుని కాపీ.. పేస్ట్ చేసేస్తారు. ఇలాంటి కల్పితాలను సృష్టించి రాసేసేముందు కనీసం ఒరిజినల్ ఇంటర్వ్యూ అయినా చూడండి" అంటూ మీడియాకు సుద్దులు చెప్పింది కస్తూరి.

తెలుగులో ఈమె గ్యాంగ్ వార్.. నిప్పు రవ్వ.. సోగ్గాడి పెళ్లాం.. మెరుపు.. చిలక్కొట్టుడు.. అన్నమయ్య.. ఆకాశవీధిలో.. డాన్ శీను చిత్రాలలో నటించింది కస్తూరి. ప్రస్తుతం యూఎస్ లో ఉంటున్న ఈమె.. తన కూతురుకు డ్యాన్స్ నేర్పించడం కోసమే ఇండియా వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/