Begin typing your search above and press return to search.

ఆమె ఒక్క ట్వీటేసిందంటే ఇక మంటే.. ఈ సారి కోహ్లీపై

By:  Tupaki Desk   |   18 Nov 2020 3:30 PM GMT
ఆమె ఒక్క ట్వీటేసిందంటే ఇక మంటే..   ఈ సారి కోహ్లీపై
X
కోలీవుడ్‌ సీనియర్ నటి కస్తూరీ ట్విట్టర్లో పేల్చే ఒక్కో ట్వీట్లు మోత మోగుతున్నాయి. ఈమె చేసే ప్రతీ ట్వీట్ ఓ సంచలనం సృష్టిస్తోంది. ఆ మధ్య వనితా విజయ్ కుమార్ ఇష్యూలో, మీరా మిథున్ వ్యవహారం వేసిన సెటైర్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కస్తూరీ చేసే ట్వీట్లు సోషల్ మీడియాలోనే కాకుండా మీడియాలోనూ సెన్సేషనల్ అవుతుంటాయి. ఆమె వేసే ట్వీట్లలో ఉండే సెటైర్లు నెటిజన్లను బాగానే ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఆమె విరాట్ కోహ్లీ పై చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. దీవాళికి బాణాసంచా కాల్చొద్దని కోహ్లీ చేసిన ట్వీట్ కి ఇప్పటికే ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయమై నాగార్జున అన్నమయ్య ఫేమ్ కస్తూరీ చేసిన ట్వీట్ మరోసారి వైరల్ గా మారింది.

ఇంతకూ కోహ్లీ చేసిన ట్వీట్ లో ఏముందంటే.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.క్రాకర్స్ కాల్చకండి.దీపావళి అంటే దీపాల పండుగ అంతే.. అని ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

ఈ ట్వీట్ చూడగానే ఫ్యాన్స్ కి మండిపోయింది. మీరైతే మీ బర్త్ డేలకు, పెళ్లిళ్లకు టపాసులు పేల్చుకోవచ్చు. మేం కనీసం పండగ కూడా చేసుకోకూడదా అని ఏకి పారేసారు.కోహ్లీ బర్త్ డే వేడుకలు ఐపీఎల్ సీజన్‌లో నే జరిగాయి. దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. బాణాసంచా పేల్చి మోత మోగించి పండగ చేశారు. అప్పుడు పర్యావరణ కాలుష్యం గురించి గుర్తుకు రాలేదా అని ట్రోల్స్ చేశారు.

తాజాగా కస్తూరీ విరాట్ కోహ్లీని ఏకిపారేసింది. విరాట్ కోహ్లీ వీడియోపై కస్తూరీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'దీపావళికి క్రాకర్స్ వద్దు. దీపాలు సరిపోతాయి. మరి మీకు తొమ్మిది స్పోర్ట్స్ కార్లు అవసరమా? వాయు, శబ్ద కాలుష్యం పెరగదా? ఓ బైక్ సరిపోతుంది కదా. చార్టెడ్ ఫ్లైట్స్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎందుకు.. ఎయిర్ పోర్ట్స్‌లో ఓవర్ లోడ్ అవుతుంది కదా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని విమర్శలు చేసింది. కస్తూరి మరో ట్వీట్ చేస్తూ యూత్ కి ఎంతో ఆదర్శనీయుడైన విరాట్ కోహ్లీ ఇలాంటి సూచనలు ముందు కాస్త అయినా ఆలోచన చేసి ఉండాల్సింది అని పేర్కొన్నారు. దీపావళి క్రాకర్స్ తయారు చేస్తూ తమిళనాడు రాష్ట్రం శివ కాశిలో కొన్ని వేల మంది బతుకు సాగిస్తున్నారని పేర్కొన్నారు. దీపావళి అంటే వారికి అన్నం పెట్టే పండుగ అని కోహ్లీపై మండిపడింది.