Begin typing your search above and press return to search.
కస్తూరీ... హిందూత్వంపై ఇవేం కామెంట్లు?
By: Tupaki Desk | 14 July 2017 11:00 AM GMTకొన్నాళ్ల క్రితం అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ అతి కొద్ది కాలం మాత్రమే మెరిసిన బొద్దు హీరోయిన్ కస్తూరి గుర్తుందా? టాలీవుడ్ మన్మధుడు భక్తిరసాన్ని పండించిన *అన్నమయ్య* సినిమాను గుర్తు చేసుకుంటే... అందులో ఆయన భార్యలుగా నటించిన రమ్యకృష్ణతో పాటు కనిపించిన మరో నటిని గుర్త చేసుకుంటే... కస్తూరి కూడా ఇట్టే మన కళ్ల ముందు కదలాడుతుంది. అన్నమయ్యతో పాటు పలు తెలుగు - తమిళ - మళయాళం చిత్రాల్లో నటించిన ఈ నటి... ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అయితే మొన్నామధ్య రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సందర్భంగా ఒక్కసారిగా ఈ నటి మీడియా ముందుకు వచ్చారు.
రజనీ రాజకీయ రంగప్రవేశంపై తనదైన వాదన వినిపించిన కస్తూరి... తాజాగా *బిగ్ బాస్* తమిళ వెర్షన్ లో వ్యాఖ్యాతగా వ్వవహరించి వివాదంలో కూరుకుపోయిన కమల్ హాసన్ కు వెన్నుదన్నుగా నిలిచేందుకు మరోమారు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సారి మీడియా ముందుకు రాకుండానే ఆమె పెను దుమారం రేపేశారు. అయినా కమల్ హాసన్‌కు మద్దతుగా నిలవాలంటే... హిందూత్వ వాదాన్ని తప్పుబట్టాలా? అన్న కోణంలో జనం కస్తూరి కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయినా కస్తూరి ఏం చేసిందన్న విషయానికి వస్తే... బిగ్ బాస్ షోలో నటించిన కమల్ తో పాటు ఆ షోలో పాలుపంచుకున్న వారిపై కేసులు నమోదు చేయాలని హిందూత్వ వాద సంస్థ తమిళ మక్కల్ కచ్చి అనే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కమల్ హాసన్ కూడా ఘాటుగానే స్పందించారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఆయనకు మద్దతుగా ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన కస్తూరి... హిందూత్వ వాదాన్ని తులనాడారు.
‘‘ముందు.. సంస్కృతి పేరు చెప్పుకొని రెచ్చిపోతున్న ‘సాంస్కృతిక అతివాదులు/తీవ్రవాదుల (extremists)’ నుంచి తమిళ సంస్కృతిని కాపాడండి. హిందూత్వం అనేది ఎవడో ఒకడి సొత్తు కాదు’’ అంటూ ఆమె కాస్తంత ఘాటైన ట్వీట్ చేశారు. ‘‘కమల్ హాసన్ ను - బిగ్ బాస్ లో పాల్గొంటున్న వారిని అరెస్ట్ చేయడం ఎందుకు..? ఇప్పటికే వారంతా 100 రోజుల పాటు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు కదా. మరి, వాళ్లు ఆ షో నిర్వహిస్తున్న విజయ్ టీవీ మీద కేసు వేస్తారా..?’’ అంటూ మరో ట్వీట్ లో ఆమె హిందూత్వ వాదులకు దాదాపుగా సవాల్ విసిరారు. అంతటితో ఆగని కస్తూరి కమల్ పై ఫిర్యాదు చేసిన హిందూత్వ వాదులను ‘సంస్కృతీ రాబంధు’లుగా అభివర్ణించిన కస్తూరి... ఆ రాబందులకు కమల్ హాసన్, షో కంటెస్టెంట్లే లక్ష్యమంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి.