Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : 'కాటమరాయుడు'
By: Tupaki Desk | 24 March 2017 8:27 AM GMTచిత్రం: ‘కాటమరాయుడు’
నటీనటులు: పవన్ కళ్యాణ్ - శ్రుతి హాసన్ - నాజర్ - ఆలీ - అజయ్ - శివబాలాజీ - కృష్ణచైతన్య - కమల్ కామరాజు - తరుణ్ అరోరా - మహేంద్రన్ - రావు రమేష్ - ప్రదీప్ రావత్ - పృథ్వీ - నాజర్ - పవిత్ర లోకేష్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
కథ: భూపతి రాజా - శివ
మాటలు: శ్రీనివాస్ రెడ్డి
స్క్రీన్ ప్లే: వాసు వర్మ - దీపక్ రాజ్ - కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ)
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం: కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ)
‘సర్దార్ గబ్బర్ సింగ్’తో తీవ్రంగా నిరాశ పరిచిన పవన్ కళ్యాణ్.. ఈసారి ఎక్కువ విరామం తీసుకోకుండా ఏడాది లోపే ‘కాటమరాయుడు’గా వచ్చేశాడు. తమిళ హిట్ మూవీ ‘వీరం’ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘గోపాల గోపాల’ ఫేమ్ కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ) దర్శకుడు. ప్రారంభోత్సవం జరుపుకున్నపుడు అంతగా ఆసక్తి రేకెత్తించని ఈ చిత్రం... విడుదల సమయానికి మంచి హైప్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఎంతమేరకు అందుకుందో చూద్దాం పదండి.
కథ:
కాటమరాయుడు (పవన్ కళ్యాణ్) రాయలసీమలో ఒక ఊరికి పెద్ద. అతడికి నలుగురు తమ్ముళ్లు. చిన్నతనం నుంచి వాళ్లను కష్టపడి పెంచి పెద్ద చేస్తాడు కాటమరాయుడు. తమ్ముళ్లంటే అతడికి ప్రాణం. తమ్ముళ్లకు అతనంటే ప్రాణం. ఐతే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై అక్రమార్కుల పని పట్టే కాటమరాయుడికి శత్రువులూ ఎక్కువే. అమ్మాయిలకు ఆమడదూరంలో ఉండే కాటమరాయుడికి అవంతి (శ్రుతి హాసన్)తో ముడిపెడతారు అతడి తమ్ముళ్లు. రాయుడి తమ్ముళ్లు చెప్పిన అబద్ధాల్ని నమ్మి.. మరికొన్ని కారణాలతో అతణ్ని ప్రేమిస్తుంది అవంతి. రాయుడు కూడా ఆమెను ప్రేమిస్తాడు. కానీ అవంతి అనుకున్నట్లుగా కాటమరాయుడు శాంతి కామకుడేమీ కాదని తనకు తెలుస్తుంది. అప్పుడు ఆమె ఏం చేసింది.. అవంతి కోసం కాటమరాయుడు మారాడా.. చివరికి వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
కాటమరాయుడు తన ప్రేయసి ఇంట్లో ఉండేటప్పుడు ఆ ఊరికి అతను కొత్త. తనకు కాబోయే మావయ్యను ఓ రౌడీ గ్యాంగ్ బెదిరిస్తుంటే.. తాను వెళ్లి మాట్లాడి సమస్యను పరిష్కరించుకుని వస్తానంటాడు రాయుడు. అక్కడికెళ్లాక పెద్ద రౌడీ రాయుడిని చూసి తేలిగ్గా మాట్లాడతాడు. అంతలో ఆ రౌడీ తండ్రి ఫోన్ చేస్తాడు. పనయ్యిందా అంటే.. ఎవడో కాటమరాయుడు అని వచ్చాడు అంటాడు. అంతే.. అవతల వ్యక్తికి చెమటలు పట్టేస్తాయి. కాటమరాయుడా.. ఐతే వెంటనే కాళ్లు పట్టుకోమంటాడు. అప్పటిదాకా విర్రవీగిన ఆ రౌడీ.. వణికిపోయి కాళ్లు పట్టేసుకుంటాడు. రెండు నిమిషాల్లో రౌడీ తండ్రి కూడా అక్కడ వాలిపోయి తన కొడుకును వదిలేయమని రాయుడిని వేడుకుంటాడు.
రెండు మూడు దశాబ్దాల నుంచి చూస్తున్నాం ఇలాంటి సీన్స్. కాకపోతే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ఇలాంటి సన్నివేశాలు ఎన్నిసార్లు చూసినా మాస్ జనాలు ఊగిపోతారు. అందులోనూ పవన్ కళ్యాణ్ ను ఇలాంటి సీన్లో చూస్తే అతడి అభిమానుల ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పేదేముంది? ‘కాటమరాయుడు’ సినిమా ఎలా సాగుతుందో చెప్పడానికి ఈ సీన్ ఒక ఉదాహరణ. పవన్ మాస్ ఇమేజ్ ను వాడుకుని.. అభిమానుల్ని.. మాస్ ప్రేక్షకుల్ని అలరించడానికి చేసిన ప్రయత్నమే ‘కాటమరాయుడు’. ఇది రొటీన్ గా.. ఒక ఫార్ములా ప్రకారం సాగిపోయే మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్. కథాకథనాల్లో ఏమాత్రం కొత్తదనం కనిపించదు. వైవిధ్యం కోరుకుంటే నిరాశ తప్పదు. మాస్ క్యారెక్టర్లో పవన్ హీరోయిజాన్ని ఎంజాయ్ చేయగలిగితేనే ‘కాటమరాయుడు’ ఓకే అనిపిస్తుంది. లేదంటే కష్టం.
కథాకథనాల పరంగా ‘కాటమరాయుడు’ చాలా పాతగా అనిపిస్తుంది కానీ.. పవన్ ఇలాంటి కథలో.. ఇలాంటి క్యారెక్టర్లో.. ఇలాంటి అవతారంలో కనిపించడమే ఇందులో కొత్దదనం. తొలిసారి పూర్తి స్థాయి గ్రామీణ కథలో నటించిన పవన్.. పంచెకట్టు.. ఖద్దరు చొక్కాల్లో.. మెలితిరిగిన మీసంతో సరికొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. పవన్ నటన.. హావభావాలు కూడా కొంచెం భిన్నంగానే ఉంటాయి. తనదైన శైలిలో హీరోయిజం పండిస్తూ.. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొడుతూ.. రొమాంటిక్ సీన్స్ లో కూడా మెప్పిస్తూ.. తన అభిమానుల్ని అలరిస్తూ సాగిపోతాడు పవన్. కాబట్టి పవన్ తో కనెక్టయితే ‘కాటమరాయుడు’తో కూడా జనాలు కనెక్టవుతారు. అలా కాకుండా కథాకథనాల మీదే ఫోకస్ పెడితే మాత్రం ఇది నిరాశ పరిచే చిత్రమే.
‘వీరం’ ఒరిజినల్ చూసిన వాళ్లకు అసలు ఏమంత ప్రత్యేకత ఉందని దీన్ని పవన్ రీమేక్ చేయాలనుకున్నాడన్న సందేహం కలిగి ఉండొచ్చు. మామూలుగా తమిళ సినిమాలు తెలుగుతో పోలిస్తే కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటాయి. కానీ తెలుగులో కూడా ఔట్ డేట్ అయిపోయిన ఫార్ములా కథతో ‘వీరం’ చేశాడు అజిత్. ఇప్పుడు ఆ కథనే తెలుగులోకి తెచ్చారు. తెలుగులో చాలా మార్పులు చేసేసినట్లు చెప్పుకున్నారు కానీ.. అంత పెద్ద మార్పులేమీ కనిపించవు. కొత్తగా కొన్ని సన్నివేశాలు కలిశాయి కానీ.. మూల కథ ఏమీ మారలేదు. తమిళంలో లాగే తెలుగులోనూ రొటీన్ గా సాగిపోతుంది ‘కాటమరాయుడు’. కథ పరంగా ఏమంత ఎగ్జైట్మెంట్ కలిగించే అంశాలేమీ లేవు ఇందులో. రాయలసీమ నేపథ్యం.. ఒక ఊరి పెద్ద.. ఎవరైనా అన్యాయంగా ప్రవర్తిస్తే తాటతీస్తాడు. అమ్మాయిలంటే అస్సలు పడదు. అలాంటి వాడు ప్రేమలో పడతాడు. హీరోయిన్.. ఆమె కుటుంబం కోసం మారే ప్రయత్నం చేస్తాడు.. ఈ నేపథ్యంలో ఒక సంఘర్షణ.. శత్రువులతో పోరు.. చివరికి కథ సుఖాంతం.. ఇలా ఒక కమర్షియల్ ఫార్మాట్లో సాగుతుంది ఈ కథ.
హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యే ఆరంభ సన్నివేశంతోనే ‘కాటమరాయుడు’ ఎలా ఉంటుందన్న ఐడియా ప్రేక్షకులకు వచ్చేస్తుంది. పవన్ పాత్రతో ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా సినిమా నడుస్తుంది. ఫైట్.. పాట అయ్యాక రొమాంటిక్ ట్రాక్ తో ప్రథమార్ధాన్ని నడిపించారు. సినిమా మొత్తంలో అత్యంత మెప్పించేది పవన్-శ్రుతి మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాకే. ముఖ్యంగా పవన్ శ్రుతికి ప్రపోజ్ చేసే సీన్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. రెండు ఫైట్లు.. మూడు పాటలు.. కొంచెం కామెడీ.. కొంచెం రొమాన్స్.. ఇలా ప్రథమార్ధం వరకు ఓ మోస్తరుగానే నడిచిపోతుంది కానీ.. ద్వితీయార్ధం మాత్రం తేలిపోయింది. రొమాన్స్.. కామెడీ పాళ్లు తగ్గిపోవడం.. ప్రధానంగా యాక్షన్ మీదే కథ నడవడం.. కొన్ని అనవసర సన్నివేశాలు.. సాగతీత వల్ల ద్వితీయార్దం భారంగా గడుస్తుంది. ఫస్టాఫ్ లో వచ్చిన విలన్లు సరిపోరని.. ఇంకో పెద్ద విలన్ని తీసుకొచ్చారు. ఆ పాత్రకు సంబంధించిన ఎపిపోడ్ వల్ల సినిమా లెంగ్త్ పెరిగింది. సినిమాను ముగించిన తీరు కూడా మామూలుగా ఉంటుంది. ద్వితీయార్ధం సినిమాపై అప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ ను కొంచెం తగ్గిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే పాటలు సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయి. అవి కథాగమనానికి కూడా అడ్డంకిగా మారాయి. ఓవరాల్ గా ‘కాటమరాయుడు’ పవన్ అభిమానుల్ని మాత్రమే మెప్పించే మాస్ మసాలా ఎంటర్టైనర్.
నటీనటులు:
‘కాటమరాయుడు’లో పవన్ కళ్యాణ్ ది వన్ మ్యాన్ షో. తన అభిమానుల్ని పూర్తి స్థాయిలో అలరించాడు పవన్. అతడి ఆహార్యం చాలా బాగుంది. లుక్.. గెటప్ పరంగా కెరీర్ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ‘కాటమరాయుడు’ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ ఎపిసోడ్లలో.. హీరోయిన్ తో రొమాన్స్ విషయంలో టిపికల్ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఆకట్టుకుంటాడు. క్లైమాక్స్ లో ఎమోషన్ కూడా బాగానే పండించాడు పవన్. శ్రుతి హాసన్ ఓకే. కీలకమైన పాత్రే కానీ.. పెర్ఫామెన్స్ కు అంత స్కోప్ ఏమీ లేదు. ఆమె గ్లామర్ పరంగా కనువిందు చేసింది. ఐతే శ్రుతి ఫిజిక్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరముందనిపిస్తుంది. కొంచెం షేపవుట్ అవుతున్న సంగతి గమనించవచ్చు. పవన్ తమ్ముళ్లుగా నటించిన వాళ్లలో అజయ్ కు ఎక్కువ మార్కులు పడతాయి. శివబాలాజీ.. కృష్ణచైతన్య.. కమల్ కామరాజు ఓకే అనిపిస్తారు. ఆలీ బాగానే ఎంటర్టైన్ చేశాడు. నాజర్ కు ఇలాంటి పాత్ర మామూలే. విలన్ తరుణ్ అరోరాది మామూలు క్యారెక్టరే. ప్రదీప్ రావత్ కూడా అంతే. రావు రమేష్ కొంచెం డిఫరెంటుగా ట్రై చేశాడు కానీ.. నటన మరీ అతిగా అనిపిస్తుంది. అతడి క్యారెక్టర్ ఫన్నీగా ఉంటుంది. పృథ్వీ పెద్దగా చేసిందేమీ లేదు.
సాంకేతికవర్గం:
అనూప్ రూబెన్స్ సంగీతం సోసోగా అనిపిస్తుంది. ఇలాంటి మాస్ మసాలా సినిమాకు తగ్గట్లుగా అతడి సంగీతం లేదు. మిర్రా మిర్రా మీసం మినహా పాటల్లో అంత ఊపు లేదు. పాటలు తీసిపడేయదగ్గట్లు లేవు కానీ.. ఈ సినిమాకు తగ్గట్లుగా అయితే లేవు. నేపథ్య సంగీతం కూడా అలాగే అనిపిస్తుంది. ప్రసాద్ మూరెళ్ల ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఆశించిన స్థాయిలో లేవు. ట్రైన్ ఫైట్లో వీఎఫెక్స్ తేలిపోయాయి. మిర్రా మిర్రా మీసం పాటను బాగానే తీశారు కానీ.. మిగతా పాటల విషయంలో రాజీ పడ్డట్లు కనిపిస్తుంది. చాలా హడావుడిగా లాగించేసినట్లు అనిపిస్తుంది. ఇక దర్శకుడు డాలీ.. తన రచయితల బృందంతో కలిసి ‘వీరం’ను పవన్ ఇమేజ్ కు తగ్గట్లుగా తీర్చిదిద్దాడు. హీరోయిజం ఎలివేట్ చేయడంలో.. యాక్షన్ ఎపిసోడ్లలో డాలీ ఆకట్టుకున్నాడు. డైలాగులు బాగానే కుదిరాయి. ‘‘చావుకే నేనంటే భయం.. నేను ఎవరి దగ్గరికి వెళ్లమంటే వాళ్ల దగ్గరికి వెళ్తుంది’’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇది రీమేక్ కాబట్టి కథాకథనాలు రొటీన్ ఉన్నాయని డాలీని నిందించలేం. చాలా వరకు ఒరిజినల్ ను ఫాలో అయిపోయాడతను.
చివరగా: ఇది రొటీన్ 'కాటమరాయుడు'
రేటింగ్- 2.5/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre