Begin typing your search above and press return to search.
ఖైదీకి కాటమరాయుడు కాంపిటీషన్
By: Tupaki Desk | 3 Feb 2017 9:28 AM GMTఖైదీ నంబర్ 150.. ఇప్పుడు టాలీవుడ్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి పాత విషయమే. నిజానికి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా ఖైదీకి ఇదే రికార్డ్ ఉంది. రిలీజ్ కి ముందే వంద కోట్లకు పైగా బిజినెస్ చేసేశాడు నిర్మాత రామ్ చరణ్. మెగాస్టార్ రీఎంట్రీలో అంత రాబట్టగలరా అనే అనుమానాలున్నా.. ఆయన స్టామినాపై కాన్ఫిడెన్స్ తో కొన్న వాళ్లకు.. ఇప్పుడు కాసుల పంట పండుతోంది.
ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అన్నయ్య చిరంజీవికి.. తమ్ముడు పవన్ కళ్యాణ్ కాంపిటీషన్ వచ్చేస్తున్నాడు. చాలా ఏరియాల్లో ఖైదీ నంబర్ 150కి దగ్గరగాను.. కొన్ని ప్రాంతాల్లో ఖైదీకి మించి బిజినెస్ జరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుంటూరు ఏరియాలో కాటమరాయుడు రైట్స్ 6 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఖైదీకి 6.40 కోట్లు దక్కాయి. వెస్ట్ గోదావరిలో పవన్ మూకి 4.60 కోట్లు ముట్టచెప్పారట. ఈ ఏరియాలో ఖైదీ నంబర్ 150ని 4.75 కోట్లకు విక్రయించారు.
ఈస్ట్ గోదావరిలో అయితే అన్నయ్యను దాటేశాడు తమ్ముడు. ఖైదీ రైట్స్ ని ఇక్కడ 5.60 కోట్లకు విక్రయిస్తే.. కాటమరాయుడు హక్కులు ఏకంగా 5.86 కోట్లు పలికాయి. మొత్తంగా అయితే.. ఖైదీ-కాటమరాయుడు ప్రి రిలీజ్ బిజినెస్ దాదాపు సమానంగా పలికే ఉండే అవకాశం ఉందని ట్రేడ్ జనాలు అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/