Begin typing your search above and press return to search.
‘సర్దార్’కు తీసిపోని కాటమరాయుడు
By: Tupaki Desk | 3 April 2017 6:27 AM GMTపోయినేడాది పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రేక్షకుల్ని ఎంత నిరాశకు గురి చేసిందో.. బయ్యర్లను ఎంతగా ముంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రూ.85 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసిన ఆ చిత్రం.. ఫుల్ రన్లో వసూలు చేసిన షేర్ రూ.52 కోట్లకు కొంచెం ఎక్కువ అంతే. దీంతో బయ్యర్లకు రూ.30 కోట్లకు పైగా కోత పడింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లు ‘సర్దార్’ దెబ్బకు కుదేలయ్యారు. దాన్నుంచి ఇంకా కోలుకోక ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టారు. నిరాహార దీక్షలకు కూడా దిగారు. ఇప్పుడు ‘కాటమరాయుడు’ బయ్యర్ల సంగతి కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు.
‘సర్దార్’తో పోలిస్తే ‘కాటమరాయుడు’ బెటర్ సినిమానే. టాక్ కూడా పర్వాలేదన్నట్లే వచ్చింది. ఆరంభ వసూళ్లు కూడా మెరుగ్గానే కనిపించాయి. ఐతే బయ్యర్ల పెట్టుబడులు భారీగా ఉన్నాయి కాబట్టి నష్టాలు తప్పవు కానీ.. ‘సర్దార్’ స్థాయిలో భారీ నష్టాలైతే ఉండవని ఆశించారు. కానీ ‘కాటమరాయుడు’.. ‘సర్దార్’కు ఏమాత్రం తీసిపోయేలా కనిపించట్లేదు. ఈ సినిమా కూడా అదే స్థాయిలో నష్టాల్ని తెచ్చిపెట్టేలాగే కనిపిస్తోంది. రెండో వీకెండ్లో మంచి వసూళ్లు తెస్తాడని అనుకున్న ‘కాటమరాయుడు’ అనుకున్నంతగా ఏమీ పెర్ఫామ్ చేయలేదు. ‘గురు’ దెబ్బకు వీకెండ్ వసూళ్లు ఏదో నామమాత్రంగా వచ్చాయి. ఇక వీకెండ్ తర్వాతి వసూళ్లపై ఆశలేమీ లేవు. దీంతో ‘కాటమరాయుడు’ బాక్సాఫీస్ ప్రస్థానానికి దాదాపుగా తెరపడినట్లే అని భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ‘సర్దార్’ దెబ్బకు.. ‘కాటమరాయుడు’ దెబ్బకు పెద్దగా తేడా ఏమీ లేదనే అనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/