Begin typing your search above and press return to search.
కాటమరాయుడు కొట్టాడండీ..
By: Tupaki Desk | 27 March 2017 9:50 AM GMTఅమెరికాలో ఏకంగా 250కి పైగా స్క్రీన్లలో రిలీజైంది పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’. సినిమా మీద హైప్ కూడా బాగుండటంతో ప్రిమియర్ షో కలెక్షన్లు ఓ రేంజిలో ఉంటాయనుకున్నారంతా. ప్రిమియర్స్.. ఫస్ట్ డే కలెక్షన్లు కలిపితే ఈజీగా మిలియన్ మార్కును టచ్ చేసేస్తుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేశారు. కానీ ఈ సినిమా గురు.. శుక్రవారాల్లో కలిపి 6.6 లక్షల డాలర్లే వసూలు చేసింది. ప్రిమియర్లతో నాలుగున్నర లక్షల డాలర్లే వచ్చాయి.
సినిమాకు టాక్ డివైడ్ గా ఉండటంతో తర్వాత కలెక్షన్లు డ్రాప్ అవుతాయని.. ఫుల్ రన్లో కానీ మిలియన్ డాలర్ మార్కును అందుకోలేదేమో అని సందేహించారు. ఐతే అమెరికాలో శని.. ఆది వారాల్లో కూడా కలెక్షన్లు స్టడీగా ఉండటంతో ‘కాటమరాయుడు’ బయ్యర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ చిత్రం ఆదివారం మధ్యాహ్నానికే మిలియన్ డాలర్ మార్కును అందుకుంది. మూడో రోజు ముగిసేసరికి ఈ చిత్రం 1.009 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. గత ఏడాది వచ్చిన పవన్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రిమియర్స్ లో ఇంతకంటే ఎక్కువే వసూలు చేసినప్పటికీ మిలియన్ డాలర్ మార్కును టచ్ చేయలేకపోవడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఈ లెక్కన చూస్తే ‘కాటమరాయుడు’ పెర్ఫామెన్స్ బాగున్నట్లే. ఈ ఏడాది మిలియన్ డాలర్ క్లబ్బులో చేరిన నాలుగో సినిమా ‘కాటమరాయుడు’. ఖైదీ నెంబర్ 150.. గౌతమీపుత్ర శాతకర్ణి.. నేను లోకల్ కూడా మిలియన్ డాలర్ మార్కును అందుకున్నాయి. ఇందులో ‘ఖైదీ నెంబర్ 150’ ఫుల్ రన్లో 2.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేయగా.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ 1.7 డాలర్ల దాకా కలెక్ట్ చేసింది. నాని సినిమా 1.1 మిలియన్ డాలర్ల వరకు వెళ్లింది. మరి ‘కాటమరాయుడు’ ఎక్కడిదాకా వెళ్తాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/