Begin typing your search above and press return to search.
కాటమరాయుడి టార్గెట్:మూడు రోజుల్లో రికవరీ
By: Tupaki Desk | 23 March 2017 10:00 AM GMT‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు బోలెడంత హైప్ వచ్చింది. ఈ సినిమాకు తొలి రోజు ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. అయినప్పటికీ ఇది పెద్ద డిజాస్టర్ గానే మిగిలింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.28.34 కోట్ల దాకా షేర్ రాబట్టి ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.55 కోట్లకు కాస్త ఎక్కువగా షేర్ వసూలు చేసిందంతే. ఆ చిత్రానికి రూ.85 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. దీంతో దాదాపు నలభై కోట్ల దాకా బయ్యర్లకు బ్యాండ్ పడింది. పవన్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ బిజినెస్ కూడా ఇంతకు తక్కువేమీ జరగలేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రావాలంటే రూ.87 కోట్ల షేర్ రాబట్టాలి. మరి ఈసారి ఏమవుతుందో అని బయ్యర్లలో కొంత ఆందోళన లేకపోలేదు.
ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిజల్ట్ రిపీటయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని ‘కాటమరాయడు’ టీం కాన్ఫిడెంట్ గా ఉంది. కంటెంట్ పరంగా ‘సర్దార్’లా తేడా కొట్టేందుకు అవకాశం లేదన్నది వాళ్ల కాన్ఫిడెన్స్. ఇది ఆల్రెడీ తమిళంలో సూపర్ హిట్టయిన సినిమాకు రీమేక్ కాబట్టి.. సినిమాకు నెగెటివ్ టాక్ అయితే రాదని భరోసాతో ఉన్నారు. ఓ మోస్తరు టాక్ వచ్చినా.. సినిమా మీద ఉన్న హైప్ వల్ల వీకెండ్ కలెక్షన్లు అదిరిపోతాయని భావిస్తున్నారు. నెలా నెలన్నరగా సరైన సినిమా లేక తెలుగు ప్రేక్షకులు ఆవురావురుమని ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 90 శాతం థియేటర్లలో నింపేయనున్నారు. కాబట్టి తొలి మూడు రోజులు హౌస్ ఫుల్స్ పడితే చాలు బయ్యర్లు సేఫ్ అయిపోతారనే అనుకుంటున్నారు. అదే జరిగితే పెట్టుబడిలో 80-90 శాతం వీకెండ్లోనే రికవర్ అయిపోతుందని.. ఆ తర్వాత వీక్ డేస్ లో ఓ మోస్తరు వసూళ్లు తెచ్చుకున్నా బయ్యర్లందరూ లాభాల బాట పట్టేస్తారని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/