Begin typing your search above and press return to search.
ఖైదీ రికార్డుకు బ్రేకేస్తున్న రాయుడు
By: Tupaki Desk | 23 March 2017 11:11 AM GMTబాహుబలి: ది బిగినింగ్ సినిమా అనేది తెలుగు సినిమా చరిత్రలో దాదాపు అన్ని రికార్డులను తుడిచేసిన ఒక ఎపిక్ మూవీ. అయితే బాహుబలి తొలిరోజు 22+ కోట్ల షేర్ ను కలక్ట్ చేసినప్పటికీ.. గతంలో సర్దార్ అండ్ జనతా గ్యారేజ్ సినిమాలు దానికి దగ్గరగా వచ్చేశాయి. కాని బాహుబలి తొలిరోజు కలక్షన్ల రికార్డును తుడిచేసింది మాత్రం.. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ అనే చెప్పాలి.
ఖైదీ నెం 150 సినిమా అత్యధికంగా తొలిరోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 23.24 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఈ షేర్ రికార్డును బాహుబలి: ది కంక్లూజన్ బ్రేక్ చేస్తుందేమో అనుకుంటే.. అంతకంటే ముందే మరో సినిమా రంగంలోకి దిగి జూలు విదుల్చుతోంది. అదే పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు. ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగులు అవ్వడం.. అలాగే భారీ సంఖ్యలో ధియేటర్లను ఈ సినిమానే రేపు ఉదయం ప్రదర్శిస్తుండటంతో.. కాటమరాయుడు ఖచ్చితంగా ఖైదీ నెం 150 డే వన్ రికార్డును తారు మారు చేస్తుందనే విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
ఇప్పటివరకు మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఖైదీ నెం 150 తొలిరోజున 23.24 కోట్లు షేర్ వసూలు చేస్తే.. దాని వెనుకనే బాహుబలి (22.4 కోట్లు).. సర్దార్ (20.9 కోట్లు).. జనతా గ్యారేజ్ (20.4 కోట్లు).. శ్రీమంతుడు (14.7 కోట్లు) సినిమాలు ఉన్నాయి. ఈ లిస్టులో కాటమరాయుడు ఒకటి లేదా రెండవ స్థానాల్లో వచ్చినా కూడా.. మొత్తంగా సినిమా 85 కోట్ల పైన వసూలు చేస్తేనే పంపిణీదారులు సేఫ్ అవుతారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/