Begin typing your search above and press return to search.
కాటమరాయుడు.. హౌస్ ఫుల్స్ కొట్టాడబ్బా
By: Tupaki Desk | 30 March 2017 5:50 AM GMTగత శుక్రవారం విడుదలైన ‘కాటమరాయుడు’కి తొలి రోజు బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్ వరకు పరిస్థితి అదుపులోనే ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరగడంతో సినిమా తొలి మూడు రోజుల్లో హౌస్ ఫుల్స్ తోనే నడిచింది. కానీ వీకెండ్ అయ్యాక కానీ సినిమా అసలు సత్తా ఏంటో తెలియలేదు. సోమవారం నుంచి వసూళ్లు ఒక్క సారిగా డ్రాప్ అయ్యాయి. సోమ.. మంగళవారాల్లో అన్ని ఏరియాల్లోనూ షేర్ నామమాత్రంగా వచ్చింది. వసూళ్లు అలాగే కొనసాగితే.. ‘కాటమరాయుడు’ పరిస్థితి దారుణంగా ఉండేది. ఐతే బుధవారం ఉగాది సెలవు కావడంతో ‘కాటమరాయుడు’కి మళ్లీ ఊపిరి తీసుకునే అవకాశం దక్కింది.
ఆదివారం తర్వాత మళ్లీ ‘కాటమరాయుడు’ థియేటర్లు కళకళాడాయి. మెజారిటీ థియేటర్లలో సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. హైదరాబాద్ లోని సింగిల్ స్క్రీన్లన్నీ జనాలతో కళకళలాడాయి. ఉదయం కొంచెం డల్లుగా ఉన్నా.. మ్యాట్నీ నుంచి సినిమా పుంజుకుంది. ఫస్ట్ షో.. సెకండ్ షోలు దాదాపుగా అన్ని చోట్లా ఫుల్సే పడ్డాయి. మల్టీప్లెక్సుల్లో కూడా బుకింగ్స్ బాగానే కనిపించాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్లో మార్నింగ్ షో మినహా అన్నిషోలకూ హౌస్ ఫుల్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని చోట్లా పరిస్థితి మెరుగ్గానే కనిపించింది. అమెరికాలో పరిస్థితి ఏమంత భిన్నంగా లేదు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘కాటమరాయుడు’ బుధవారం సత్తా చాటాడు. ఈ రోజు దాదాపు రూ.5 కోట్ల షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో సినిమా రూ.50 కోట్ల షేర్ మార్కుకు దగ్గరైనట్లే. ఈ వారాంతంలో కూడా ఓ మోస్తరు వసూళ్లు సాధిస్తే.. నష్టాలు కొంత మేర తగ్గుతాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/