Begin typing your search above and press return to search.
కాటమరాయుడు టైటిల్ ఎంత పని చేసింది
By: Tupaki Desk | 7 Nov 2016 10:30 PM GMTసినిమా టైటిళ్ల విషయంలో ఇండస్ట్రీలో గొడవలు మామూలే. ఒకరు అనుకున్న టైటిల్ ఇంకొకరు అప్పటికే రిజిస్టర్ చేయించేసి ఉండటం.. వీళ్లు వాళ్లతో బేరాలు పెట్టడం.. వాళ్లు భారీగా డబ్బులు డిమాండ్ చేయడం లాంటి కథలు చాలా వింటుంటాం. ఐతే ‘కాటమరాయుడు’ టైటిల్ విషయంలో నడిచిన కథ మాత్రం భలే చిత్రమైంది. ఈ సినమా టైటిల్ పవన్ కళ్యాణ్ సినిమాకు అనుకోకముందే సప్తగిరి హీరోగా పరిచయమయ్యే సినిమాకు ఫిక్స్ చేయడం.. ఆ టైటిల్ రిజిస్టర్ చేయించుకుని.. సినిమా మొదలుపెట్టి 70-80 శాతం పూర్తి చేసేయడం జరిగిపోయింది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ సినిమా కోసం టైటిల్ అడగడం ఆలస్యం.. టైటిల్ ఇచ్చేసి.. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అని పేరు మార్చుకుంది ఆ చిత్ర యూనిట్.
ఈ టైటిల్ విషయంలో మొన్నటిదాకా ఉన్న ఊహాగానాలన్నీ నిజమే అని నిన్నటి ఆడియో వేడుకతో స్పష్టమైంది. పవన్ కళ్యాణ్.. శరత్ మరార్ స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఐతే ఇలా ఈ టైటిల్ ఇచ్చేయడం వల్ల ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ యూనిట్ కు జరిగిన మేలు అంతా ఇంతా కాదు. మామూలుగా సప్తగిరి హీరోగా సినిమా అంటే జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఆడియో వేడుకకు వస్తాడన్న సమాచారం బయటికి వచ్చినప్పటి నుంచి దాని మీద జనాల ఫోకస్ పడింది. ఇక పవన్ కోసం ఆడియో వేడుకను భారీగా నిర్వహించడం.. పవన్ వచ్చి ఈ వేడుకలో మాట్లాడటంతో ఈ సినిమా బాగా చర్చనీయాంశమైంది. సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చింది. మొత్తానికి టైటిల్ మార్చుకోవడం వల్ల నష్టమేమీ రాకపోగా.. చాలా ప్రయోజనం కలిగింది. ఇప్పుడు సినిమాకు వచ్చిన ప్రచారంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చే అవకాశముంది. మొత్తానికి సప్తగిరి కోసం దర్శకుడు అరుణ్ పవార్ ఎలాంటి స్క్రిప్టు రాశాడో.. సినిమా ఎలా తీశాడో కానీ.. ‘కాటమరాయుడు’ అని తన సినిమాకు టైటిల్ పెట్టడం ద్వారా మాత్రం తన సినిమాకు చాలా మేలు చేసుకున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/