Begin typing your search above and press return to search.

కాటమరాయుడు రెండవ రోజు కలెక్షన్స్

By:  Tupaki Desk   |   26 March 2017 10:16 AM GMT
కాటమరాయుడు రెండవ రోజు కలెక్షన్స్
X
తొలి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘కాటమరాయుడు’ రెండో రోజుకు ఆ జోరు చూపించలేకపోయాడు. టాక్ డివైడ్ గా ఉండటంతో రెండో రోజు వసూళ్లలో పెద్ద డ్రాప్ కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 22 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన ‘కాటమరాయుడు’ రెండో రోజు కేవలం రూ.5.12 కోట్ల షేర్ తో సరిపెట్టుకున్నాడు. ఇది ఈ సినిమా బయ్యర్లలో తీవ్ర ఆందోళన రేపేదే. రెండో రోజు కలెక్షన్లు తగ్గడం మామూలే కానీ.. మరీ ఈ స్థాయిలో డ్రాప్ ఊహించనిది. అడ్వాన్స్ బుకింగ్స్ వీకెండ్ మొత్తానికి అయిపోయాయని.. మూడు రోజులూ ‘కాటమరాయుడు’ హవా సాగడం ఖాయమని అనుకున్నారు కానీ.. అలా ఏమీ జరగలేదు. అన్ని ఏరియాల్లోనూ తొలి రోజు కోట్లల్లో వసూలు చేసిన కాటమరాయుడు రెండో రోజుకు లక్షల్లోకి వచ్చేశాడు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో తొలి రోజు రూ.3.5 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజుకు రూ.32 లక్షలకు పరిమితమైంది. ఆంధ్రా-రాయలసీమలో కలిపి రెండో రోజు రూ.3.32 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. నైజాంలో కొంచెం మెరుగ్గా రూ.1.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రెండు రోజుల్లో ‘కాటమరాయుడు’ షేర్స్ ఏరియాల వారీగా..

నైజాం (తెలంగాణ)-రూ.5.92 కోట్లు

సీడెడ్‌ (రాయలసీమ)-రూ.3.95 కోట్లు

వైజాగ్ (ఉత్త‌రాంధ్ర‌)-రూ.3.78 కోట్లు

తూర్పు గోదావ‌రి-రూ.3.88 కోట్లు

గుంటూరు-రూ.3.28 కోట్లు

కృష్ణా- రూ.3.28 కోట్లు

ప‌శ్చిమ‌గోదావ‌రి-రూ.3.13 కోట్లు

నెల్లూరు-రూ.1.45 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి షేర్-రూ.27.45