Begin typing your search above and press return to search.
టైటానిక్ కపుల్ 20 ఏళ్ళ తరువాత కూడా..
By: Tupaki Desk | 20 Aug 2017 10:04 AM GMT1997లో వచ్చిన టైటానిక్ సినిమా జనాలను ఉర్రూతలూగించింది. అప్పటికే రెండుసార్లు టైటినిక్ కథపై సినిమాలు వచ్చాయి. కాని ఆ సినిమాల్లో లేనిది ఈ సినిమాను సూపర్ స్పెషల్ గా చేసింది ఏంటంటే.. అది ఖచ్చితంగా ఈ జేమ్స్ క్యామరూన్ టైటానిక్ లో రోస్ అండ్ జాక్ పాత్రలను పోషించిన లీడ్ కపులే. వీరిద్దరూ ఎవరో కాదు.. కేట్ విన్సెలట్ మరియు లియోనార్డో డికాప్రియో. ఆ సినిమా చేసినప్పటి నుండీ వీరిద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు.
సాధారణంగా చాలామండి లీడ్ పెయిర్స్ ప్రేమికులగా మారి.. పెల్ళి చేసుకుని పిల్లలను కని.. తరువాత విడాకులు తీసుకుంటుంటారు. కాని కేట్ అండ్ లియో మాత్రం.. అప్పటినుండి మంచి స్నేహితులుగానే ఉన్నారు. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమని చెప్పుకున్నారు కాని.. ఎప్పుడూ కూడా డేటింగ్ లేదా మ్యారేజ్ వంటి వాటి జోలికి పోలేదు. ఇప్పుడు ఫ్రాన్స్ దేశంలోని సెయింట్ ట్రోపెజ్ ఐలాండ్ లో ఇద్దరూ కలసి పూల్ పక్కనే హాటు హాటుగా కనిపించారు. అయితే అక్కడకు ఎందుకు వెళ్ళారంటే.. లియో నిర్వహించే ఒక ఫౌండేషన్ తాలూకు చారిటి ఈవెంట్ కోసం కేట్ వచ్చిందిలే. అక్కడ నిర్వహించే చారిటీ డిన్నర్లో వీరు పాల్గొంటారు. అలా వచ్చిన డబ్బులతో లియో పర్యావరణ పరిరక్షణ కోసం కోట్లు ఖర్చు చేస్తుంటాడు.
మొత్తానికి ఈ డిన్నర్ ఈవెంట్లో తన స్నేహితుడి కోసం కేట్ ఇలా రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్ కు చెందిన 41 ఏళ్ళ కేట్ మూడుసార్లు పెళ్ళిచేసుకుంది.. ముగ్గురు పిల్లలున్నారు. ఇక 42 ఏళ్ల అమెరికన్ లియోనార్డో డికాప్రియో మాత్రం చాలామందిని డేటింగ్ చేశాడు కాని పెళ్ళి చేసుకోలేదు. పిల్లలు కూడా లేరు. అది సంగతి.