Begin typing your search above and press return to search.
భారత వృద్ధుడి చర్యతో టైటానిక్ హీరోయిన్ ఎమోషనల్
By: Tupaki Desk | 29 April 2020 5:45 AM GMTటైటానిక్.. ప్రపంచంలోని గొప్ప చిత్రాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పటికీ తమ ఫేమరెట్ సినిమాల్లో ఒకటిగా దీని పేరే చెబుతారు. లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్ లెట్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ప్రపంచ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఒక క్లాసిక్ అనే చెప్పవచ్చు. అంతటి అద్భుత సినిమాలో నటించిన హీరోయిన్ కేట్ విన్స్ లెట్ తాజాగా ఆ చిత్రం గురించి.. భారత్ లో తనకు ఎదురైన అనుభవం గురించి ఆసక్తిగా స్పందించారు.
ఆ సినిమా తర్వాత హీరోయిన్ కేట్ విన్స్ లెట్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. టైటానిక్ విడుదలయ్యాక తాను కొన్ని రోజులకు భారత్ కు వెళ్లానని.. హిమాలయాలు చూద్దామని వెళ్లానని కేట్ తెలిపారు. తాను హిమలాయాలకు ఓ బ్యాగ్ వేసుకొని నడుస్తున్నానని.. నా వెనుకే ఓ వృద్ధుడు వస్తున్నాడని.. ఆయనకు 85 ఏళ్లకు పైనే ఉంటాయన్నారు. ఒక కన్ను కూడా ఆయనకు సరిగా కనిపించడం లేదన్నారు.
కానీ ఆ వృద్ధుడు నన్ను చూసి ‘యూ.. టైటానిక్’ అన్నాడని.. దానికి తాను అవును అని సమాధానం చెప్పానని కేట్ విన్స్ లెట్ తెలిపారు. వెంటనే ఆ వృద్ధుడు తన చేతిని గుండెలపై పెట్టుకొని థ్యాంక్యూ చెప్పాడన్నారు.
ఆ సంఘటనతో తనకు కన్నీళ్లు ఆగలేదని.. ఒక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా నాకు ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని తనకు భారత్ లో ఎదురైన అనుభవాన్ని కేట్ గొప్పగా చెప్పుకున్నారు.