Begin typing your search above and press return to search.
కథ వెనుక కథ టీజర్.. ఇంట్రెస్టింగ్..
By: Tupaki Desk | 17 Feb 2023 10:46 PM GMTక్రైమ్ స్టోరీలకు ఎప్పటికీ మంచి డిమాండ్ ఉంటుంది. ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్ట కలిగే కథనం ఉంటే చాలు అవి సక్సెస్ అయినట్టే లెక్క. అందుకే క్రైం థ్రిల్లర్ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయినా కాకపోయినా ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ తెచ్చుకుంటాయి. ఈ క్రమంలో ఆసక్తికరమైన కథ కథనాలతో వస్తున్న మరో క్రైం థ్రిల్లర్ మూవీ కథ వెనుక కథ. దండమూడి అవనీంద్ర కుమార్ నిర్మాతగా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వస్తున్న సినిమా కథ వెనుక కథ.
కథ చెప్పడం మొదలు పెట్టిన ఒకతను కథ చెబుతుంటే మరోపక్క సిటీలో ఒకరి వెంట ఒకరు అమ్మాయిలు మిస్ అవడం పోలీసులు విచారణలో వారు గుర్తు తెలియని విధంగా విగత జీవులుగా కనిపిస్తారు. ఈ కేసు డీల్ చేయడానికి వచ్చిన ఇంటెలిజెంట్ కాప్ సునీల్ వీటి గురించి క్లూస్ వెతుకుతూ ఉంటాడు. ఇంతకీ ఈ కేసుకు కథ చెబుతున్న విశ్వంత్ కు సంబంధం ఏంటి.. కేసులో మిస్ అవుతున్న క్లూ ఏంటి ఫైనల్ గా పోలీసులు ఈ కేసుని ఎలా చేధించారు అన్నది సినిమా కథ.
టీజర్ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ టీజర్ ని రీసెంట్ గా వీర సింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేనితో రిలీజ్ చేయించారు. కథ వెనుక కథ ఇంట్రెస్టింగ్ గా సాగే క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతుంది. సినిమాలో సునీల్ కి మంచి పాత్ర పడినట్టు తెలుస్తుంది.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సునీల్ తన సత్తా చాటినట్టు తెలుస్తుంది. కనిపించడానికి కథలో హీరోగా విశ్వంత్ ని చూపించినా సినిమాకు హీరో సునీల్ అనే చెప్పొచ్చు. ఇక సినిమాలో హీరోయిన్ గా శ్రీజిత గౌష్ నటిస్తుంది. క్రైం థ్రిల్లర్ సినిమాలకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్.. కథ వెనుక కథ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. టీజర్ లో అతని మ్యూజిక్ టాలెంట్ చూపించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.