Begin typing your search above and press return to search.
అప్పుడు పెళ్లిచూపులు..ఇప్పుడు కథలో రాజకుమారి
By: Tupaki Desk | 26 Feb 2017 6:26 AM GMTఅమెరికాలో బిగ్గెస్ట్ ఎవర్ టాలీవుడ్ హిట్ ఏది అంటే ‘బాహుబలి’ అని ఎవరైనా చెప్పేస్తారు. కానీ ఓవరాల్ వసూళ్ల లెక్కల్లో కాకుండా పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే మాత్రం అక్కడ ‘పెళ్లిచూపులు’ చిత్రమే అతి పెద్ద హిట్. ఈ సినిమాపై చాలా నామమాత్రంగా పెట్టుబడి పెట్టారు. కానీ ఆ చిత్రం అక్కడ ఏకంగా 1.3 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. పెట్టుబడి మీద ఎన్నో రెట్లు వసూలు చేసింది. ఈ చిత్రంతో కలెక్షన్ల పంట పండించుకున్న సంస్థ ‘ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిల్మ్స్’. ‘పెళ్లిచూపులు’తో ఆ సంస్థకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే సంస్థ నారా రోహిత్ కొత్త సినిమా ‘కథలో రాజకుమారి’ని అమెరికాలో రిలీజ్ చేస్తుండటం విశేషం.
20 రోజుల ముందు వరకు ‘కథలో రాజకుమారి’ గురించి జనాలకు పెద్దగా పట్టింపు లేదు. కానీ ఈ చిత్ర లోగో.. ఫస్ట్ లుక్ చూశాక సీన్ మారిపోయింది. షాకింగ్ లుక్ లోకి మారిపోయిన రోహిత్ ను చూసి అందరూ డంగైపోయారు. సినిమా మీద జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది. కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని రూపొందించిన చిత్రమిది. ఆరన్ మీడియా వర్క్స్ బేనర్లో రోహితే ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. ప్రశాంతి.. కృష్ణవిజయ్.. సౌందర్య నిర్మిస్తున్నారు. ఇది సినీ నేపథ్యంలో సాగే చిత్రమని సమాచారం. నారా రోహిత్ ఇందులో రకరకాల అవతారాల్లో కనిపిస్తాడట. నాగశౌర్య.. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవిలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు మార్చిలో ఆడియో వేడుక చేయనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/