Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: అంతు చిక్కని కథనం

By:  Tupaki Desk   |   8 March 2019 10:25 PM IST
టీజర్ టాక్: అంతు చిక్కని కథనం
X
గత ఏడాది రంగస్థలంలో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించిన చిత్రం కథనం. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా టీజర్ విడుదల చేశారు. సినిమాల్లో రచయితగా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చిన అనసూయకు తను రాసుకున్న ప్రకారమే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మొదట అదంతా అబద్ధమని కొట్టి పారేసిన పోలీసులకు తర్వాత జరిగిన అనూహ్య పరిణామాలు నమ్మే స్థితికి తీసుకొస్తాయి.

ఈ లోపు అనసూయ ప్రమాదాల్లో ఇరుక్కోవడంతో పాటు చేధించలేని విష వలయం ఏర్పడుతుంది. అందులో నుంచి ఎలా బయటపడింది అసలు సినిమా కోసం రాసుకున్న కథలాగే చుట్టూ సంఘటనలు ఎలా జరిగాయి అన్నదే కథనంలో అసలు కథ

విజువల్ గా టెక్నీకల్ గా కథనంలో విషయం ఉన్నట్టే కనిపిస్తోంది. శ్రీనివాస్ అవసరాల-ధనరాజ్-వెన్నెల కిషోర్-పృథ్వి ఇతర కీలక పాత్రల్లో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం బాగానే క్యారి అయ్యింది. రాజేష్ నాదేండ్ల దర్శకత్వంలో క్వాలిటీ ఉంది. లైన్ ఇంతకు ముందు వచ్చిన త్రిపుర-ఏ ఫిల్మ్ బై అరవింద్ ఛాయల్లో ఉన్నప్పటికీ ఇది హారర్ జానర్ కాదు కాబట్టి కొంచెం వేరుగా ఉంది.

క్రైమ్ థ్రిల్లర్ కావడంతో క్షణం తర్వాత అనసూయకు సోలోగా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అంత కన్నా ఎక్కువ స్కోప్ ఇచ్చిన మూవీగా కథనం అనిపిస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా వదిలిన టీజర్ అనసూయ ఫ్యాన్స్ తో ప్రేక్షకులకు ఓ మాదిరిగా నచ్చేలా ఉన్న కథనం విడుదల తేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది.