Begin typing your search above and press return to search.

తెలుగు ఇండ‌స్ట్రీ..మెగా ఫ్యామిలీకి క‌త్తి వార్నింగ్‌

By:  Tupaki Desk   |   15 April 2018 10:10 AM GMT
తెలుగు ఇండ‌స్ట్రీ..మెగా ఫ్యామిలీకి క‌త్తి వార్నింగ్‌
X
టాలీవుడ్ లో సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు న‌మోద‌వుతున్నాయి. ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తూ టాలీవుడ్ సంగ‌తుల్ని బ‌య‌ట‌పెడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ మీద శ్రీ‌రెడ్డి గ‌ళం విప్పితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద విమ‌ర్శ‌ల మీద విమ‌ర్శ‌లు చేస్తూ బోలెడంత ఇమేజ్ ను తెచ్చుకున్నారు మ‌హేశ్ క‌త్తి. ఆయ‌న‌పై సునీత అనే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌టం తెలిసిందే.

త‌న‌పై మ‌హేశ్ క‌త్తి లైంగిక వేధింపుల‌కు గురి చేశారంటూ ఒక ఛాన‌ల్లో జ‌రిగిన చ‌ర్చ‌లో ఆమె వ్యాఖ్యానించింది. దీనిపై తాజాగా మ‌హేశ్ క‌త్తి రియాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోని త‌ప్పుల మీద తాను గ‌ళం విప్పితే.. త‌న‌ను అగౌర‌వానికి గురి చేసేలా ఆరోప‌ణ‌లు చేయ‌టంపై మండిప‌డ్డారు. త‌న‌ను అప్ర‌తిష్ట‌కు గురి చేయ‌టం.. త‌న క్యారెక్ట‌ర్ ను బ‌ద్నాం చేసిన వైనంపై ఆయ‌న సీరియ‌స్ అయ్యారు.

లేనిపోని ఆరోప‌ణ‌లు చేశార‌ని.. దీనికి సంబంధించిన ఆధారాలు ఉంటే పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌న్నా ఇప్ప‌టి వ‌ర‌కూ చేయ‌క‌పోవ‌టంపై అనుమానాలు వ్య‌క్తం చేశారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న త‌ప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే.. వాటిని స‌రి చేసుకోవాల్సింది పోయి త‌న‌ను టార్గెట్ చేస్తారా? అని ప్ర‌శ్నించారు.

తాను లాయ‌ర్ తో సంప్ర‌దింపులు జ‌రిపాన‌ని.. రేపు (సోమ‌వారం) ప‌రువున‌ష్టం దావా వేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. రూ.50 ల‌క్ష‌ల రూపాయిల‌కు దావా వేయాల‌ని చెప్పాన‌ని.. ఇందుకోసం కోర్టుకు రూ.5 ల‌క్ష‌లు డిపాజిట్ చెల్లించాల‌ని లాయ‌ర్ చెప్పార‌ని.. ఆ ఏర్పాట్ల‌లో ఉన్న‌ట్లు చెప్పారు. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన సునీత అనే అమ్మాయి త‌న‌కు గ‌తంలో ప‌రిచ‌యం ఉంద‌ని.. కానీ ఏ మాత్రం నిజం లేకున్నా.. ఒక క‌ట్టుక‌థ‌ను అల్లి ఆమెను ఛాన‌ల్ కు పంపిన‌ట్లుగా ఆరోపించారు. తాను సైరా ఆఫీసు నుంచి వ‌చ్చాన‌ని.. వాకాడ అప్పారావు పేరును ప్ర‌స్తావించ‌టం చూస్తే త‌న‌కు కొత్త సందేహాలు వ‌స్తున్న‌ట్లు చెప్పారు.

సైరా ఆఫీస్ నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్న ఆ అమ్మాయి వెనుక కొణిదెల ప్రొడ‌క్ష‌న్ హ‌స్తం ఉందా? లేదా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేసిన క‌త్తి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తాను చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. త‌న‌ను కెల‌కొద్ద‌ని గ‌తంలోనూ చెప్పార‌ని.. ఇప్పుడు నేరుగా త‌న వ్య‌క్తిగ‌త ప‌రువును దెబ్బ తీయ‌టానికి ప్ర‌య‌త్నించిన నేప‌థ్యంలో తానిక ఉపేక్షించేది లేద‌న్నారు.

పిల్లి బిత్తిరి వేషాలు త‌న ద‌గ్గ‌ర ప‌ని చేయ‌వ‌న్న మ‌హేశ్‌.. రెండు.. మూడు రోజుల్లో తానుకొన్ని విష‌యాలు బ‌య‌ట‌పెడ‌తాన‌ని.. వాటితో చాలామంది బ‌తుకులు ఏమిటో అర్థ‌మ‌వుతాయ‌న్నారు. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన అమ్మాయికి స‌రిగా కోచింగ్ ఇవ్వ‌లేద‌ని ఎట‌కారం చేసిన క‌త్తి.. రెండు.. మూడు రోజులు వెయిట్ చేస్తే చాలా విష‌యాల‌కు స‌మాధానాలు దొరుకుతాయ‌ని.. చాలామంది మంది బ‌తుకులేందో అంద‌రికి తెలుస్తాయ‌ని.. అందుకు పెద్ద స‌మ‌యం లేద‌ని క‌త్తి స్ప‌ష్టం చేశారు. ఇంత‌కీ.. క‌త్తి ద‌గ్గ‌ర ఉన్న ఆ స‌మాచారం ఏమిటి? వాటితో మెగా.. ప‌వ‌ర్.. మెగాప‌వ‌ర్ లాంటి వారికి సంబంధించిన‌వా? లేక వేరే వారివా? అన్న‌ది ఇప్పుడు ప‌ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం ఒక కొలిక్కి వ‌స్తుంద‌నుకుంటున్న వేళ‌.. క‌త్తి అల్టిమేటం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి