Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందే జంట‌గా హాజ‌రైన క‌త్రినా-విక్కీ!

By:  Tupaki Desk   |   6 Nov 2021 8:32 AM GMT
పెళ్లికి ముందే జంట‌గా హాజ‌రైన క‌త్రినా-విక్కీ!
X
బాలీవుడ్ లో విక్కీ కౌశ‌ల్-క‌త్రినా కైఫ్ ప్రేమ ప‌క్షుల్లా విహ‌రిస్తున్నారంటూ ఓవైపు ప్ర‌చారం స్పీడ్ గా సాగుతున్నా..మ‌రోవైపు వీటిని అంతే సింపుల్ గా కొట్టిపారేయ‌డం ఈ జంట‌కు కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే చాలాసార్లు వీళ్లిద్ద‌రు జంట‌గా మీడియా కంటికి చిక్కారు. క‌నిపించిన ప్ర‌తీసారి పెళ్లి ఎప్పుడు? అని మీడియా ప్రశ్నించ‌డం.. ప్ర‌తిగా అలాందేమి లేద‌ని ఖండించ‌డం ప‌రిపాటిగా మారింది. తాజాగా ఈ జంట మరోసారి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. అందుకు బ‌ల‌మైన కార‌ణం లేక‌పోలేదు. ఇద్ద‌రు జంట‌గా నిర్మాత ఆర్తిశెట్టి ఆహ్వానం మేర‌కు దీపావ‌ళి పండుగ‌కు హాజ‌ర‌య్యారు.

సెల‌బ్రేష‌న్స్ అనంత‌రం గ్రాండ్ గా పార్టీ కూడా జ‌రిగింది. ఈ పార్టీ కోసం క‌త్రినా ప్ర‌త్యేకంగా ముస్తాబైంది. గులాబీ రంగు చీర క‌ట్టుకున్ని మ్యాచింగ్ జాకెట్ ధ‌రించి ట్రెడీష‌నల్ గా క‌నిపించింది. ఆర్తిశెట్టి ఇంటి ముందు కారుదిగుతూ ఇలా చీర‌క‌ట్టులో క‌నిపించింది. అయితే కారుని క‌త్రినా స్వ‌యంగా డ్రైవ్ చేసుకుంటూ వ‌చ్చింది. అలాగే ఇదే వేడుక‌కు విక్కీ విశాల్ కూడా ఒక్క‌డే హాజ‌ర‌య్యారు. కారులో స్నేహితులు ఎవ్వ‌రూ లేకుండా ఆయ‌న ఒక్క‌డే రావ‌డం విశేషం. అనంత‌రం క‌త్రినా-విక్కీ విశాల్ క‌లిసి జంట‌గా ఆర్తిశెట్టి గుమ్మంలో కాలు పెట్టారు. ఇప్పుడీ వార్త సోష‌ల్ మీడియాలో మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.

డిసెంబ‌ర్ లో పెద్ద‌లు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసార‌ని..అందుకే ఈ జంట ప‌బ్లిక్ గా ఇలా తిరిగేస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఈవార్త‌ల‌పై విక్కీ-క‌త్రినా ఎలా స్పందిస్తారో చూద్దాం.ఈ శుక్ర‌వారం క‌త్రినా న‌టించిన `సూర్య‌వంశీ `ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. దీంతో మ‌రో స‌క్సెస్ క‌త్రినా ఖాతాలో ప‌డింది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న `టైగ‌ర్ -3` లో న టిస్తోంది. మ‌రోవైపు విక్కీ విశాల్ `స‌ర్దార్ ఉద్దమ్` తో మ‌రో స‌క్సెస్ అందుకున్నారు. అలాగే 1971 ఇండియా- పాకిస్తాన్ యుద్ధం నేప‌థ్యంలో `సామ్ బ‌హ‌దూర్` టైటిల్ తో తెర‌కెక్కుతోన్న మ‌రో చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇందులో ఇండియ‌న్ ఆర్మీ చీఫ్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.