Begin typing your search above and press return to search.

విక్కీ-క్యాట్ నిశ్చితార్థ ఫోటో వైర‌ల్

By:  Tupaki Desk   |   15 Dec 2021 8:30 AM GMT
విక్కీ-క్యాట్ నిశ్చితార్థ ఫోటో వైర‌ల్
X
డిసెంబ‌ర్ 9న రాజ‌స్థాన్ లో జ‌రిగిన వివాహం లో విక్కీ కౌశ‌ల్- క‌త్రిన జంట ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. పెళ్లి ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఈ పెళ్లిని లీకులేవీ లేకుండా అత్యంత గోప్యంగా జ‌రుపుకోవ‌డం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

కాస్త డిలే అయినా కానీ వీరి నిశ్చితార్థం నుంచి కొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి. విక్కీ కౌశల్ -క‌త్రిన జంట‌ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పెళ్లి ఫోటోల‌ను విడుదల చేస్తున్నారు. ఇంత‌లోనే కత్రినా హెయిర్ స్టైలిస్ట్ డేనియల్ బాయర్ స్టార్ జంట ఫోటోలను పంచుకున్నారు. ది సగాయ్ అంటూ వ్యాఖ్య‌ను దీనికి జోడించారు.

కత్రినా - విక్కీ ఇద్దరూ తమ ఖరీదైన గులాబీ రంగు దుస్తులలో కవలలుగా కనిపించారు. ప్రేమించడం.. గౌరవించడం..ఆదరించడం..! అని కత్రినా కైఫ్ ఈ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది.

మనోహరమైన ఈ జంట చిత్రాలలో శృంగారభరితంగా క‌నిపించింది. సబ్యసాచి డిజైన‌ర్ దుస్తుల్లో త‌ళ‌త‌ళా మెరిసింది ఈ జంట‌. ఇవ‌న్నీ కొన్ని సెకన్లలో అభిమానులు.. స్నేహితులలో వైర‌ల్ కాగా.. హృదయ ఎమోజీలు వ్యాఖ్యలతో రిప్ల‌య్ లు వ‌చ్చాయి.

కత్రినా గులాబీ రంగు పూల నెట్ చీరను ధరించి.. పూల ప్రింట్ ఫిల్ స్లీవ్స్ బ్లౌజ్ తో తలపై ధరించే షీర్ వీల్ తో ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపించ‌గా.. చేతిలో గులాబీ పువ్వుల బొకే పట్టుకుని కనిపించింది. విక్కీ మరోవైపు పీచు రంగు షేర్వానీ ధరించి రాయల్ గా కనిపించాడు. పెళ్లి ఫోటోల‌తో పాటు నిశ్చితార్థ ఫోటో కూడా వైర‌ల్ గా మారాయి.