Begin typing your search above and press return to search.
రాజస్థాన్ లో విక్-క్యాట్ వెడ్డింగ్..అతిథులు వీళ్లే!
By: Tupaki Desk | 18 Nov 2021 5:42 AM GMTబాలీవుడ్ నటి కత్రినాకైఫ్- విక్కీ కౌశల్ డిసెంబర్ లో వివాహం చేసుకుంటున్నట్లు కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియా ప్రత్యేక కథనాలతో వేడెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ జంట ఎఫైర్ గురించి ఇప్పటివరకూ అధికారికంగా వెల్లడించలేదు గానీ మీడియా మాత్రం పెళ్లి చేసుకుంటున్నట్లు బలమైన ప్రచారమే చేస్తోంది.
తాజాగా ఈ జంట మ్యారేజ్ గురించి అప్ డేటెడ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. రాజస్థాన్ లోని విక్ -క్యాట్ వివాహం చాలా సింపుల్ గా జరుగుతుందని టాక్ జోరుగా వినిపిస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. కొందరు సినీ ప్రముఖులు మాత్రమే ఈవెడ్డింగ్ కి హాజరవుతారని సమాచారం.
దర్శకుడు కబీర్ ఖాన్.. అతని భార్య మినీ మాధుర్.. వరుణ్ ధావన్ అతని సతీమణి నటాషా.. ప్రేమ పావురాలు సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ..కరణ్ జోహార్..రోహిత్ శెట్టి మాత్రమే బాలీవుడ్ నుంచి అటెండ్ అవుతున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్.. అజయ్ దేవగన్.. అక్షయ్ కుమార్.. అమీర్ ఖాన్.. షారుక్ ఖాన్.. దీపికా పదుకొణేలకు ఆహ్వానం అందినా షూటింగ్ బిజీ కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం. ఇక రణబీర్ కపూర్-ఆలియా భట్ కూడా అదే సమయంలో తమ పెళ్లిని కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.
ఆ కారణంగా ఈ జంట వెళ్లలేరని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ పెళ్లి కేవలం 125 మంది అతిథుల సమక్షంలో మాత్రమే జరుగుతుందని గుసగుస వినిపిస్తోంది. ఇక పెళ్లి వేదిక రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ బర్వారా రిసార్ట్స్ ని నిర్ణయించారుట. ఇది ఎంతో ఖరీదైన లగ్జరీ రిసార్స్ట్ అని తెలుస్తోంది. ఇది రాజస్థాన్ వంటకాలకి ఎంతో ఫేమస్. రాజస్థాన్ అందాల నడుమ ఈ రిసార్స్ట్ నెలకొని ఉందని తెలుస్తోంది. అంతా బాగానే ఉంది. ఇప్పటివరకూ పెళ్లి తేది మాత్రం ఇంకా బయటకు రాలేదు.