Begin typing your search above and press return to search.

విక్కీ నా రాడార్ ప‌రిధిలో లేడ‌నేసిన క‌త్రిన‌

By:  Tupaki Desk   |   8 Sep 2022 9:30 AM GMT
విక్కీ నా రాడార్ ప‌రిధిలో లేడ‌నేసిన క‌త్రిన‌
X
'కాఫీ విత్ క‌ర‌ణ్' సీజ‌న్ 7 స్టార్ల గుట్టుమ‌ట్ల‌తో పాటు వ్య‌క్తిగ‌త జీవితాల్లో సంచ‌ల‌న నిజాల‌ను బ‌య‌ట‌పెడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా క‌త్రిన‌- విక్కీ జంట‌కు సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ బ‌య‌ట‌ప‌డింది.

కరణ్ జోహార్ చాట్ షో 'కాఫీ విత్ కరణ్ 7' ప‌దవ ఎపిసోడ్ లో 'ఫోన్ భూత్' స్టార్లు సిద్ధాంత్ చతుర్వేది - ఇషాన్ ఖట్టర్ లతో కలిసి సంద‌డి చేయ‌డానికి క‌త్రిన‌ సిద్ధంగా ఉంది. ఇది డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రత్యేకంగా సెప్టెంబరు 8న ఉదయం 12 గంటలకు ప్రదర్శితం కానుంది. ఈ సీజన్ లో మొదటిసారి ముగ్గురు క‌లిసి ఈ వేదిక‌ను పంచుకుంటున్నారు. ఈ ముగ్గురూ రొమాన్స్- ల‌వ్ ఇంట్రెస్ట్స్ - శోభ‌నం (సుహాగ్రాత్ భావన) గురించి చర్చించే క్ర‌మంలో వేడిని పెంచ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఎపిసోడ్ సమయంలో కత్రినా చివరకు విక్కీ కౌశల్ తో తన సంబంధం గురించి కూడా ఓపెనైంది.

క‌త్రిన తాజాగా ఒక షాకింగ్ విష‌యాన్ని రివీల్ చేసింది. విక్కీ తన 'రాడార్'(క‌నుచూపు ప‌రిధి)లో ఎప్పుడూ లేడని చెప్పింది. "నాకు అతని గురించి పెద్దగా తెలియదు. అతను నేను విన్న పేరు మాత్రమే.. కానీ ఎప్పుడూ త‌న‌తో అనుబంధం పై ఏదీ లేదు. కానీ నేను అతడిని కలిసినప్పుడు నేను (మ‌న‌సు) గెలిచాను!" అని న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడింది. త‌మ మ‌ధ్య‌ సంబంధాన్ని అనుకోని బంధ‌మ‌ని నీలిరంగుకు సింబ‌ల్ అని కూడా అంది క‌త్రిన‌. "ఇది నా విధి.. ఇది నిజంగా రాసి ఉన్న‌ది.. మా మ‌ధ్య‌ చాలా యాధృచ్ఛిక సంఘటనలు జరిగాయి. ఒకానొక సమయంలో అవన్నీ చాలా అవాస్తవంగా అనిపించాయి" అని కూడా తెలిపింది. ఇంతలోనే విక్కీ గతంలో కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 6లో సిద్ధార్థ్ మల్హోత్రాతో క‌లిసి కనిపించాడు.

కత్రినా -విక్కీ జంట‌ గత సంవత్సరం డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకున్నారు. పెళ్లి.. ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాల నుండి ఫోటోగ్రాఫ్స్ వీడియోలు సోషల్ మీడియాల్లో వ‌ర‌ల్ అయ్యాయి. పెళ్లికి ముందు ఈ జంట‌ తమ సంబంధం గురించి బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడలేదు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... విక్కీ- కత్రినా ఇద్దరూ ఆసక్తికరమైన లైన‌ప్ ను కలిగి ఉన్నారు. విక్కీ ప్ర‌స్తుతం గోవింద నామ్ మేరా చిత్రంలో కనిపించనున్నారు. సారా అలీ ఖాన్ తో లక్ష్మణ్ ఉటేకర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ నిర్ణ‌యించ‌లేదు. సామ్ బహదూర్ మూవీతో పాటు.. ఆనంద్ తివారీ తదుపరి చిత్రంలోను నటించనున్నారు.

మరోవైపు కత్రినా 'ఫోన్ భూత్‌' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. మెర్రీ క్రిస్మస్- టైగర్ 3లోనూ న‌టిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన టైగర్ 3 చేస్తుండ‌గా.. ప్రియాంక చోప్రా - అలియా భట్‌లతో కలిసి ఫర్హాన్ అక్తర్ జీ లే జరాలో నటించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.