Begin typing your search above and press return to search.

బ్రేకప్‌ పై ఇప్పటికి నోరు విప్పింది

By:  Tupaki Desk   |   5 Dec 2018 1:30 AM GMT
బ్రేకప్‌ పై ఇప్పటికి నోరు విప్పింది
X
బాలీవుడ్‌ లో కొన్నాళ్ల ముందు వరకు స్టార్‌ హీరోయిన్‌ గా ఊపు ఊపేసిన కత్రీనా కైఫ్‌ ప్రస్తుతం కాస్త కెరీర్‌ పరంగా ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. చాలా నమ్మకం పెట్టుకుని చేసిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ చిత్రం కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో కత్రీనా క్రేజ్‌ మరింతగా తగ్గిపోయిందని చెప్పుకోవాలి. ఇక కత్రీనా కొన్నాళ్ల క్రితం వరకు రణ్‌ బీర్‌ తో ప్రేమాయణం సాగించిన విషయం తెల్సిందే. కత్రీన, రణ్‌ బీర్‌ ల ప్రేమాయణం గురించి అంతా కూడా ఓపెన్‌ అయ్యింది. అప్పట్లో ఇద్దరు సహజీవనం కూడా సాగించారు. వీరిద్దరు కలిసి ఒక అందమైన ఇంటిని కూడా తీసుకున్నారు. ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరు విడిపోయారు.

కత్రీనా, రణ్‌ బీర్‌ లు విడిపోయి చాలా కాలం అయ్యింది. బ్రేకప్‌ కు సంబంధించి ఇన్నాళ్లు ఇద్దరిలో ఎవరు కూడా స్పందించలేదు. అయితే బ్రేకప్‌ అయినట్లుగా మాత్రం లీక్‌ లు ఇచ్చారు. బ్రేకప్‌ తర్వాత రణ్‌ బీర్‌ కొంత గ్యాప్‌ ఇచ్చి బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియాభట్‌ ను తన ప్రేమలో పడేశాడు. ఆమెతో ప్రస్తుతం చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. త్వరలోనే వీరిద్దరి పెళ్లి ఖాయం అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఇద్దరి జోడీ బాగుందని బాలీవుడ్‌ లో చర్చ కూడా జరుగుతుంది. ఇక మరో వైపు కత్రీనా ప్రస్తుతానికి ఒంటరిగానే జీవితాన్ని గడిపేస్తుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన బ్రేకప్‌ గురించి మాట్లాడిన అందరిని ఆశ్చర్య పర్చింది. ఎప్పుడు కూడా వ్యక్తిగత విషయాల గురించి చర్చించని కత్రీనా మొదటి సారి తన జీవితంలో బ్రేకప్‌ అనేది మంచి అనుభవంగా చెప్పుకొచ్చింది. రణ్‌ బీర్‌ పేరు ప్రస్థావించకుండానే ఆయనతో బ్రేకప్‌ వల్ల తనకు చాలా మంచి జరిగిందని, బ్రేకప్‌ తర్వాత తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను, చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నాను అంది. బ్రేకప్‌ ను నాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను అంటూ కూడా చెప్పింది. ప్రస్తుతం ఎవరినైనా ప్రేమిస్తున్నారా అంటూ ప్రశ్నించగా కత్రీనా నవ్వేసింది.