Begin typing your search above and press return to search.

డ్రైవర్ పై అనుమానం పెంచుకున్న హీరోయిన్

By:  Tupaki Desk   |   9 Oct 2016 7:05 AM GMT
డ్రైవర్ పై అనుమానం పెంచుకున్న హీరోయిన్
X
సినిమా తారలకు అతి పేద్ద ట్రబుల్ వారి గుట్టు మట్లు దాచుకోవడమే. ఎలా తెలుస్తాయో కానీ.. స్టార్లు ఎక్కడికెళితే అక్కడ మీడియా వాళ్లు వెంటబడిపోవడం కామన్. అసలు తామే ఆఖరి నిమిషంలో నిర్ణయించుకుని వస్తే.. తమ కంటే ముందే వీళ్లెలా వచ్చారో అర్ధం కాక జుట్టు పీక్కునే పరిస్థితి ఎదురవుతుంది.

ఈ విషయంలో హీరోయిన్స్ కి అయితే మరీ ఇబ్బంది ఎక్కువ. ఎవరిని అనుమానించాలో ఎవరిని ఏమనాలో తెలియక కన్ ఫ్యూజన్ ఎదురవుతూ ఉంటుంది. కానీ బాలీవుడ్ కత్తి కత్రినా కైఫ్ కి మాత్రం ఈ విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసిందని తెలుస్తోంది. తన మూవ్ మెంట్స్ ను పర్సనల్ సంగతులను ఎంత సీక్రెట్ గా దాచి పెడదామన్నా.. మీడియాలో దర్శనం ఇచ్చేస్తుండడం ఈ బామకు బాగా చికాకు తెప్పించిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆదిత్య రాయ్ కపూర్ తో సన్నిహితంగా ఉందనే వార్తలు.. ఆ కుర్ర హీరోతో పెళ్లి అంటూ ప్రచారం బాగా ఎక్కువైపోయింది.

దీనికంతటికీ కారణం తన డ్రైవర్ అని ఫిక్స్ అయిపోయిందట కత్రినా. తనకు అత్యంత సన్నిహితంగా మెలిగే డ్రైవర్ కి మినహాయిస్తే మిగతావారికి ఇంతలా డీటైల్స్ లీక్ చేయడం సాధ్యం కాదని భావించడంతో.. ఇప్పుడా డ్రైవర్ ను ఉద్యోగంలోంచి తీసేయాలని ఫిక్స్ అయిందట కత్రినా కైఫ్.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/