Begin typing your search above and press return to search.
ప్రేమ గువ్వలు పెళ్లాడుకుంటే ఆస్తి విలువ 150కోట్లు!
By: Tupaki Desk | 18 April 2020 5:15 AM GMTబాలీవుడ్ వింత ప్రేమాయణాల గురించి ఏమని చెప్పాలి. ఏజ్ తో గేజ్ తో పనే లేకుండా అక్కడ ప్రేమాయణాలు వేడెక్కిస్తుంటాయి. ఆ కోవలోనే ఇంతకుముందు సల్మాన్ సోదరుడి భార్య మలైకా తో యువహీరో అర్జున్ కపూర్ ప్రేమాయణం గురించి ఆసక్తికర చర్చ సాగింది. ఇక ఇటీవల సల్మాన్ మాజీ ప్రేయసి అయిన కత్రిన కైఫ్ తో డేటింగ్ చేస్తూ తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్ చాటు మాటు వ్యవహారాలు చక్కబెట్టడం బాలీవుడ్ ని హీటెక్కిస్తోంది. మొదటి ఎఫైర్ విషయంలో సల్మాన్ గుర్రుమీదున్నాడని ప్రచారమైంది. ఇప్పుడు మాజీ ప్రేయసితో ఎఫైర్ అంటే ఆయన పరిస్థితేంటో?
ఇక కత్రినా కైఫ్ .. విక్కీ కౌషల్ తో పోలిస్తే చాలా సీనియర్. అయినా ఇద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వేడెక్కిస్తున్నాయి. ఇద్దరూ తరచూ విందు వినోదాల్లో మునిగి తేలడం ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడం .. ఆ పార్టీలు కాస్తా అంతర్జాలంలో వైరల్ అవ్వడం తెలిసిందే. ఈషా అంబానీ తన పిరమల్ ఇంట్లో నిర్వహించిన హోలీ పార్టీలో.. ఈ జంట వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ పార్టీ వీడియో నెట్ లో జోరుగా వైరల్ అయ్యింది. అక్కడ పార్టీ అంతటా ఇద్దరూ కలిసి కనిపించారు. తన లేడీ లవ్ ని విడిచి ఉండలేనంత ఆప్యాయంగా విక్కీ అల్లుకుపోయాడు.
ఇక ఆ ఇద్దరి మధ్యా బాండింగ్ బలపడుతున్న క్రమంలోనే తమ అభిమాన తారల నికర ఆస్తుల విలువను తెలుసుకోవటానికి ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఉన్నారు. కత్రినా కైఫ్.. విక్కీ కౌషల్ నికర ఆస్తుల విలువ ఎంత? అన్నది ఆరా తీస్తే.. ఆ ఇరువురి ఆస్తుల మధ్య అతి పెద్ద వ్యత్యాసం ఉందన్న నిజం బయటపడింది. కత్రినా కైఫ్ మోడలింగ్ తో పాటు షోబిజ్ లో తన వృత్తిని కొనసాగిస్తోంది. 2003లో బూమ్ అనే చిత్రంతో బాలీవుడ్ లో ప్రవేశించింది. ఇప్పటికి రకరకాల మార్గాల్లో ఆర్జించిన నికర ఆస్తుల విలువ సుమారు రూ.128 కోట్లు. బాలీవుడ్ లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నాయికల్లో కత్రిన ఒకరు. తన ప్రధాన ఆదాయాలు సినిమాలు.. ఎండార్స్‌మెంట్ లు.. స్టేజ్ షోలు.. వీటికి తోడు ఇటీవల మేకప్ బ్రాండ్ `కే` తనకు భారీ ఆదాయం తెచ్చి పెడుతోంది. ఇక ప్రియుడు విక్కీ కౌశల్ ఒక్కో చిత్రానికి రూ .10 కోట్లు వసూలు చేస్తున్నాడు.
కెరీర్ పరంగా సాలిడ్ ఎంపికలతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించిన విక్కీ కౌషల్ చిత్ర పరిశ్రమలో తన కెరీర్ ను `గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్`తో ప్రారంభించాడు. ఆ సినిమాకి అనురాగ్ కశ్యప్ కు సహాయకుడిగా పని చేశాడు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రెండు ప్రాజెక్టులలో చిన్న పాత్రలు పోషించాడు. విమర్శకుల ప్రశంసలు పొందిన మాసాన్ చిత్రంతో పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అప్పటి నుండి అతను వెనక్కి తిరిగి చూడలేదు. దేశభక్తి నేపథ్యంలో `యూరి: ది సర్జికల్ స్ట్రైక్` కోసం జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఇప్పటికి విక్కీ నికర ఆస్తుల విలువ సుమారు రూ .21 కోట్లు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన తరువాత.. విక్కీ కౌషల్ తన ఫీజును ఒక్కో చిత్రానికి 3 కోట్ల రూపాయలకు పెంచాడు. అతను మెర్సిడెస్ బెంజ్ జిఎల్సీ ఎస్.యు.వి కారును కలిగి ఉన్నాడు. అనుకోకుండా కత్రినను పెళ్లాడితే ఈ జంట ఆస్తుల విలువ 150 కోట్లు ఉంటుందన్నమాట.