Begin typing your search above and press return to search.

వైట్ లో బ్రైట్ గా కేట్ మెరుపులు

By:  Tupaki Desk   |   18 April 2017 4:54 PM GMT
వైట్ లో బ్రైట్ గా కేట్ మెరుపులు
X
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఇప్పుడు కాసింత స్లో అయింది. గతేడాది వరకూ జోరు చూపించి తెగ రెచ్చిపోయిన ఈ భామకు.. రణబీర్ కపూర్ తో బ్రేకప్ అటు పర్సనల్ గా దెబ్బకొడితే.. వరుస ఫ్లాప్స్ ప్రొఫెషనల్ గా ఇబ్బంది పెడుతున్నాయి.

అయితే.. ఇలాంటి కష్టాలను ముందే అనుభవించేసి మరీ ఈ స్థాయికి రావడంతో.. కేట్ వీటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతోంది. ప్రస్తుతం ఈ అందాల భామ చేతిలో సినిమాలతో పాటు అనేక బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ కూడా ఉన్నాయి. వీటిలో ఒకదాని కోసం ఇప్పుడు బాలీవుడ్ కత్తి షూటింగ్ లో పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలో ఇలా వైట్ డ్రెస్ లో బ్రైట్ గా మెరుస్తోంది కత్రినా. అందాల ఆరబోతలోనే కాదు.. చూపుతోనూ తానెంత మత్తెక్కించగలదో చెప్పకనే చెబుతోంది కేట్. క్లీవేజ్ లైన్ మాత్రం బాగా ఎగ్జిబిట్ అయ్యేలా ఫోకస్ చేసిన ఈ వైట్ మెరుపులు.. తళతళలాడిపోతున్నాయి.

ఇక నడుం అందాలను.. కాలి షోకులను ట్రాన్స్ పరెంట్ డ్రెస్ లోంచి చూపిస్తూ తెగ ఊరించేస్తోంది. చేతిలో బాటిల్ పట్టుకుని ఇలా పోజులు అయితే ఇస్తోంది కానీ.. అమ్మడిని ఇంత మిలమిల్లాడుతూ చూసిన తర్వాత.. ఆ డ్రింక్ బాటిల్ దాహం తీర్చగలదా చెప్పండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/