Begin typing your search above and press return to search.

నా ముద్దు దక్కిన అతడు చాలా లక్కీ

By:  Tupaki Desk   |   13 Dec 2018 7:04 AM GMT
నా ముద్దు దక్కిన అతడు చాలా లక్కీ
X
ఒకప్పుడు హాలీవుడ్‌ కే పరిమితం అయిన లిప్‌ లాక్‌ సీన్స్‌ మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ లో కూడా చాలా కామన్‌ అయ్యాయి. ఇప్పుడు సౌత్‌ లో కూడా ముద్దు సీన్స్‌ చాలా రొటీన్‌ అయ్యాయి. ముద్దు సీన్స్‌ సినిమా లో ఉంటే ప్రత్యేకంగా మాట్లాడే రోజులు పోయాయి. ప్రతి సినిమా లో కూడా ముద్దు సీన్స్‌ ఉంటున్న నేపథ్యంలో పెద్ద గా అవి చర్చనీయాంశం కావడం లేదు. కాని ‘జీరో’ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌- కత్రీనాల ముద్దు సీన్‌ మాత్రం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంది. ఎందుకంటే పొట్టిగా కనిపించే షారుఖ్‌ కు వంగి మరీ కత్రినా లిప్‌ కిస్‌ ఇవ్వడంతో అందరి దృష్టి ఆ ముద్దు పై పడినది.

‘జీరో’ చిత్రంలో షారుఖ్‌- కత్రీనాల ముద్దు చర్చలో భాగంగా నే షారుఖ్‌ మొదటి ఆన్‌ స్క్రీన్‌ మొదటి లిప్‌ లాక్‌ గురించి కూడా చర్చ వస్తుంది. స్టార్‌ హీరోలంతా కూడా లిప్‌ లాక్‌ సీన్స్‌ చేస్తున్న సమయంలో చాలా సంవత్సరాల పాటు షారుఖ్‌ ఆ సీన్స్‌ కు నో చెబుతూ వచ్చాడు. అయితే బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ యశ్‌ చోప్రా ఒత్తిడి తో తప్పనిసరి పరిస్థితుల్లో జబ్‌ తక్‌ హే జాన్‌ సినిమలో కత్రీనా తో మొదటి సారి లిప్‌ లాక్‌ చేశాడు.

షారుఖ్‌ వంటి స్టార్‌ మీ తో మొదటి లిప్‌ లాక్‌ చేశాడు కదా, అందుకు మీరు గర్వంగా ఫీల్‌ అవుతారా అంటూ మీడియా తాజాగా కత్రీనాను ప్రశ్నించింది. ఆ సమయంలో ఆమె కాస్త విభిన్నంగా స్పందించి.. నేనేం లక్కీ గా ఫీల్‌ అవ్వలేదు, ఇప్పుడు అవ్వడం లేదు. అప్పుడు నన్ను మొదటి సారి ముద్దు పెట్టుకున్నందుకు షారుఖ్‌ లక్కీ అంది. తనను ఏ హీరో అయితే ముద్దు పెట్టుకుంటాడో అతడు లక్కీ అంటూ చెప్పుకొచ్చింది. కేట్‌ సమాధానంకు మీడియా వారితో పాటు ఆమె తో ఉన్న ‘జీరో’ చిత్ర యూనిట్‌ సభ్యులు గట్టిగా నవ్వేశారు.

జీరో చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా కోసం బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. షారుఖ్‌ ఈ చిత్రంలో మరగుజ్జు పాత్రలో కనిపించబోతున్నాడు. అనుష్క శర్మ మరో హీరోయిన్‌ గా నటించింది.