Begin typing your search above and press return to search.
రణబీర్ గాలి తీసేసిన మాజీ ప్రేయసి
By: Tupaki Desk | 1 Jun 2016 9:30 AM GMTఎంత సినిమా వాళ్లయినా సరే.. తమ బ్రేకప్ స్టోరీల గురించి మాట్లాడ్డానికి అస్సలు ఇష్టపడరు. తమ మాజీ లవర్లతో సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. ఐతే కత్రినా కైఫ్ మాత్రం ఈ విషయంలో అస్సలు మొహమాటపడట్లేదు. రణబీర్ కపూర్ తో బ్రేకప్ అయ్యాక కూడా అతడితో సినిమా చేస్తోంది. అతడి గురించి ఓపెన్ గా మాట్లాడేస్తోంది. ఐతే సినిమా చేయడం అన్నది తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్న పని. ఎందుకంటే రణబీర్ తో లవ్ లో ఉండగానే ఒప్పుకున్న సినిమా ‘జగ్గా జాసూస్’. దాన్ని పూర్తి చేయక తప్పదు. కాస్త ముభావంగానే అతడితో కలిసి షూటింగ్ లో పాల్గొంటోంది.
ఐతే అసలే రణబీర్-కత్రినాల మధ్య కెమిస్ట్రీ పండట్లేదని దర్శకుడు అనురాగ్ బసు ఫీలవుతుంటే.. రణబీర్ కు కాక తెప్పించే వ్యాఖ్యలు చేసి.. అతడితో మరింత దూరం పెరిగేలా చేసుకుంది కత్రినా. రణబీర్ పేరెత్తకుండానే అతడి గాలి తీసేసే వ్యాఖ్య ఒకటి చేసింది కత్రినా. ఈ మధ్య మీడియాతో మాట్లాడుతున్నపుడు రణబీర్ తో బ్రేకప్ ప్రస్తావన రాగానే.. ‘‘నాది కర్కాటక రాశి. ఈ రాశి వాళ్లు వ్యక్తిగత విషయాల్ని గోప్యంగా ఉంచుతారు. దీనికి తోడు నేను అమ్మాయిని కావడం కూడా నేను నా బ్రేకప్ గురించి మాట్లాడకపోవడానికి ఓ కారణం. ఐతే ఆ విషయం ఎత్తినపుడు నాతో సంబంధం లేని ఓ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వస్తుంది. మాటి మాటికీ నిర్ణయాలు మార్చుకునే ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటే కష్టం’’ అంది కత్రినా. ఓ దశలో తనతో పెళ్లికి ఓకే అని చెప్పి ఆ తర్వాత మాట మార్చేసిన రణబీర్ కు పరోక్షంగా గట్టి పంచే వేసింది కత్రినా. మరి ఈ వ్యాఖ్యలపై రణబీర్ ఏమంటాడో.. వీళ్లిద్దరూ కలిసి షూటింగ్ ఎలా సాగిస్తారో చూడాలి.