Begin typing your search above and press return to search.

పెళ్లికి వెళ్లి డ్యాన్స్ చేసిన క‌త్రినా!

By:  Tupaki Desk   |   22 Jun 2019 6:50 AM GMT
పెళ్లికి వెళ్లి డ్యాన్స్ చేసిన క‌త్రినా!
X
ఎవ‌రైనా స‌రే.. చివ‌ర‌కు క‌త్రినా కైఫ్ అయినా స‌రే.. భారీగా రెమ్యున‌రేష‌న్ ఇవ్వాలే కానీ పెళ్లింటికి వ‌చ్చి డ్యాన్స్ చేస్తుంద‌న్న విష‌యం తాజా ఉదంతంతో స్ప‌ష్ట‌మైన‌ట్లే. ఇప్ప‌టివ‌ర‌కూ సినీ న‌టులు.. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ల కుటుంబాల్లో జ‌రిగే వివాహ వేడుక‌ల్లో డ్యాన్స్ చేసే క‌త్రినా.. తాజాగా రూ.200 కోట్ల ఖ‌ర్చుతో చేప‌ట్టిన పెళ్లి వేడుక‌కు వెళ్లి డ్యాన్స్ చేసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

డెహ్రాడూన్ లోని ఔలీ ప్రాంతానికి చెందిన ఒక సంప‌న్న కుటుంబంలో ఒక వివాహం తాజాగా జ‌రిగింది. ఆ వివాహం కోసం వారు పెట్టిన ఖ‌ర్చు ఏకంగా రూ.200 కోట్లు. ఆ వేడ‌క కోసం భారీ ఏర్పాట్లు చేశారు. బాలీవుడ్ అగ్ర‌న‌టి క‌త్రినా కైఫ్ ను త‌మ వివాహ వేడుక‌లో డ్యాన్స్ చేయాల‌ని కోరారు. ఆమె తొలుత ఓకే అన‌కున్నా.. భారీగా రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌టంతో క‌త్రినా వ‌చ్చేందుకు అంగీక‌రించారు.

వివాహ‌వేదిక వ‌ద్ద‌కు క‌త్రినా వ‌చ్చేందుకు ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ ను ఏర్పాటు చేశారు. నిజానికి ఆమెతో పాటు ప‌లువురి కోసం హెలికాఫ్ట‌ర్ల‌ను సిద్ధం చేశారు. వివాహ వేదిక వ‌ద్ద తీస్ మార్ ఖాన్ సినిమాలోని షీలాకీ జ‌వానీ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించారు. క‌త్రినా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

ఈ వేడుక‌కు ప‌లువురు సినీ.. టీవీ న‌టులు హాజ‌రై అతిధుల్ని అల‌రించారు. క‌త్రినానే వ‌చ్చిన‌ప్పుడు మిగిలిన వారు రాకుండా ఉంటారా?