Begin typing your search above and press return to search.
రెండో ఆలోచనే లేకుండా నమ్మనంది!
By: Tupaki Desk | 3 Jun 2019 1:30 AM GMTఒకరి మీద ఎంత నమ్మకం కోల్పోతే అసలు రెండోమారు ఆలోచన అన్నదే లేకుండా `ఎప్పటికీ నమ్మలేను` అని చెప్పేస్తుంది. అసలు మీ జీవితంలో నమ్మకూడని ఒక వ్యక్తి ఉన్నారు అంటే అది ఎవరు? అని ప్రశ్నిస్తే.. ఎలాంటి సంకోచం లేకుండా రణబీర్ పేరు చెప్పి షాకిచ్చింది కత్రిన. `సే ఇట్ ఆర్ స్ట్రిప్ ఇట్` అంటూ టాప్ సీక్రెట్స్ ని ఓపెన్ చేయించే `బీఎఫ్ ఎఫ్` టీవీ కార్యక్రమంలో హోస్ట్ నేహా ధూపియా అడిగిన ఓ ప్రశ్నకు కత్రిన వైల్డ్ గా నే స్పందించింది.
అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా ఏదీ దాచుకోకుండా అన్నీ ఓపెన్ గా మాట్లాడేసిన కత్రిన అసలు తను నమ్మని వ్యక్తి అంటూ ఉన్నాడు అంటే అది రణబీర్ మాత్రమేనంటూ ఖరాకండిగా తెగేసి చెప్పేసింది. అంతగా ఏం దెబ్బ తింది పాపం? అంటే ఓ మారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం కండల హీరో సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన కత్రిన ఉన్నట్టుండి అతడి నుంచి బ్రేకప్ అయ్యింది. అంతేకాదు.. ఆ వెంటనే చాక్లెట్ బోయ్ రణబీర్ తో నిండా ప్రేమలో మునకలు వేసింది. రెండేళ్ల పాటు రణబీర్ లోకంలో మునిగి తేలింది. కట్ చేస్తే వన్ ఫైన్ డే.. రణబీర్ ఇచ్చిన జోల్ట్ కి దిమ్మ తిరిగిపోయింది.
అసలే చాక్లెట్ బోయ్.. ఆపై భామలతో ఎఫైర్లు! ఇంకేం ఉంది.. కత్రిన ఈగో హర్టయ్యింది. మల్టిపుల్ ఉమెన్ తో రాసలీలలకు సిద్ధపడే ఇలాంటి చాక్లెట్ బోయ్ తనకి వద్దనుకుంది. ఆ తర్వాత రణబీర్ నుంచి విడిపోయి ఒంటరి అయ్యింది. మౌనంగా కొన్నేళ్ల పాటు ఎలాంటి హడావుడి లేకుండా తెరవెనకే ఉండిపోయింది. ఇంతకాలానికి తిరిగి వరుసగా సినిమాల్లో నటిస్తూ మాజీ ప్రియుడు సల్మాన్ చెంతకే చేరుకుంది క్యాట్. భాయ్ సరసన వరుసగా రెండు సినిమాల్లో నటించేసింది. టైగర్ జిందా హై తర్వాత భారత్ చిత్రం రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రచారంలోనూ కత్రిన బిజీ బిజీగా ఉంది.
కలర్స్ బీఎఫ్ఎఫ్ కార్యక్రమంలోని చిట్ చాట్ లో ఉన్నదున్నట్టు మాట్లాడేసింది కత్రిన. అప్పట్లో నిండా మునిగాను అని అంగీకరించింది. అందుకు రిగ్రెట్స్ అన్నవే లేవని తేల్చేసింది. నేడు ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఎపిసోడ్ కలర్స్ ఇన్‌ఫినిటీ నెట్ వర్క్ లో టెలీకాస్ట్ కానుంది. ప్రస్తుతం విభిన్నమైన పాత్రల్లో చాలా శ్రమిస్తున్నానని కత్రిన కెరీర్ ముచ్చట్లు తెలిపింది. రాజ్ నీతి- జిందగి న మిలేగి దొబారా- న్యూయార్క్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించానని ఆ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ప్రస్తుతం ఓ కొత్త దశలో అడుగుపెట్టానని .. ఈ దశలో కొత్తగా ప్రయత్నిస్తున్నాను అని అంది. తన గత బాంధవ్యాలు తనని సంతోషంగానే ఉంచాయని కొసరుగా చెప్పింది.