Begin typing your search above and press return to search.
ప్రియుడి ఆవేదనను కళ్లకు కట్టింది
By: Tupaki Desk | 14 Sep 2015 7:30 PM GMTసల్మాన్ ఖాన్ ప్రేయసి అన్న ట్యాగ్ తో కెరీర్ ను నిలబెట్టుకున్న కత్రినా కైఫ్.. స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నాక అతడికి టాటా చెప్పేసింది. కొంచెం గ్యాప్ తీసుకుని స్టార్ హీరోగా ఎదుగుతున్న రణబీర్ కపూర్ తో ప్రేమాయణం మొదలు పెట్టింది. ఇద్దరూ మూడేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. గత ఏడాదే ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలొచ్చాయి కానీ.. ఇప్పటికీ ఆ సంగతేంటో తేలడం లేదు. ఐతే పెళ్లి ఇలా వాయిదా పడుతుండటానికి కారణమేంటని రణబీర్ సన్నిహితుల్ని ఆరా తీస్తే హీరోగా మళ్లీ ఫామ్ లోకి వచ్చాకే పెళ్లి అంటున్నాడని సమాచారం. హీరోగా అతను చేసిన గత మూడు సినిమాలూ దారుణమైన ఫలితాన్ని చూశాయి. దీంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాకే పెళ్లి అంటున్నాడట.
ఐతే తన ప్రియుడు మామూలోడు కాదని.. త్వరలోనే బంపర్ హిట్ కొడతాడని అంటోంది కత్రినా. ‘‘సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాకీ హృదయం పెట్టి పని చేస్తాడు రణబీర్. ఒక నటుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అదే. బేషారమ్ - రాయ్ - బాంబే వెల్వెట్ సినిమాలు ఫ్లాపవడంతో రణబీర్ మనసు గాయపడింది. తన అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయానన్న బాధలో రణబీర్ ఉన్నాడు. సినిమాలంటే రణబీర్ కున్న ఆసక్తి మరెవరిలోనూ నేను చూడలేదు. త్వరలోనే రణబీర్ పుంజుకుంటాడు. అతను ఇప్పుడు చేస్తున్న సినిమాలూ చాలా స్పెషల్. కచ్చితంగా త్వరలోనే హిట్టు కొడతాడు చూడండి’’ అని కాన్ఫిడెంటుగా చెప్పింది కత్రినా. మరి తమాషా - జగ్గా జాసూస్ సినిమాలు కత్రినా నమ్మకాన్ని ఏమేరకు నిలబెడతాయో చూడాలి.