Begin typing your search above and press return to search.

వీళ్లకి పెళ్లాం స్టేటస్ వద్దంట

By:  Tupaki Desk   |   18 Sep 2015 7:30 AM GMT
వీళ్లకి పెళ్లాం స్టేటస్ వద్దంట
X
ఫలానా వాళ్ల భార్య, వీళ్లాయన భలే మంచి వ్యక్తి, ఈమె భర్త చాలా గొప్పోడు.. ఇలా ఉంటాయి మహిళల విషయంలో మనోళ్ల పరిచయాలు. కానీ ఈ తరహా గుర్తింపును ఛీ కొడుతున్నారు ఈ తరం బాలీవుడ్ భామలు. తమకు ప్రత్యేకత ఉందని, దాన్నే గుర్తించాలంటున్నారు. కాదని క్వశ్చన్ చేస్తే... కస్సుబుస్సులాడుతున్నారు. ఫాంటమ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా సైఫ్ అలీ ఖాన్ తో కలిసి చక్కర్లు కొడుతోంది కత్రినా కైఫ్. మధ్యలో ఒకరు రణ్ బీర్ కపూర్ లవర్ గా ఈమెను ప్రస్తావించడంతో.. కేట్ కి కోపం వచ్చింది.

పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న తనకు.. రణబీర్ లవర్ గా కంటే, సొంతగానే ఎక్కువ ఇమేజ్ ఉందని చెప్పింది. ఈమె వాదనకు ఫాంటమ్ హీరో సైఫ్ కూడా సై అన్నాడు. అంతెందుకు కరీనా కపూర్ తన భార్యే అయినా.. ఆమె ఓ సెలబ్రిటీ అని, ఇంతటి ప్రతిభావంతులను వంటింటి కుందేళ్లుగా జమకట్టేలా మాట్లాడ్డం కరెక్ట్ కాదని తేల్చేశాడు. అదీ కరెక్టే అనిపిస్తోంది.

ఇప్పుడు ఐశ్వర్యా రాయ్ ని.. అభిషేక్ బచ్చన్ భార్య అనో, అమితాబ్ కోడలు అనో అంటే కరెక్ట్ కాదు కదా.. వాళ్లకంటూ స్పెషల్ స్టేటస్ సంపాదించుకుంటున్నారు. సింగిల్ గానే సినిమాను సక్సెస్ చేయగల సత్తా ఉందని చాటుకుంటున్నారు. కఠినమైన కేరక్టర్లకు సై అంటున్నారు. అలాంటప్పుడు కేవలం ఓ వ్యక్తి భార్యగానే గుర్తించేలా మాట్లాడ్డం సరి కాదని ఒప్పుకోవాల్సిందే.