Begin typing your search above and press return to search.
మెడలో మంగళ సూత్రంతో మల్లీశ్వరి ఫోజ్
By: Tupaki Desk | 4 Jan 2022 11:30 AM GMTకత్రినాకైఫ్-విక్కీ కౌశల్ జంట ఇటీవలే వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నవదంపతులు మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో సీక్రెట్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలంతా సెలబ్రేషన్స్ మూవ్ మెంట్స్ ని ఇన్ స్టా వేదికగా పంచుకున్నా.. విక్కీ-క్యాట్ మాత్రం ఆ ఫోటోల్ని కూడా రహస్యంగానే ఉంచారు. పెళ్లికి ముందు ఎలా వ్యవహరించారో..పెళ్లి తర్వాతా వ్యక్తిగత ఫోటోల్ని లీక్ చేయలేదు. పెళ్లైన వెంటనే ఈ జంట హనీమూన్ కి ప్లాన్ చేసిన సంగతి తెలిసినదే. ఆ డీటైల్స్ కూడా ఇంతవరకూ ఎక్కడా లీక్ అవ్వలేదు అంటే ఎంతగా గోప్యంగా ఉంచుతున్నారో అర్ధమవుతోంది.
తాజాగా పెళ్లైన తర్వాత మొదటి సారి ఓ ఫోటోని కత్రినా ఇన్ స్టా వేదికగా పంచుకుంది. తమ ఫ్టాట్ లో దిగిన ఓ సెల్ఫీని ఇలా ఇన్ స్టాలో పంచుకుంది. ఇందులో క్యాట్ వింటర్ కోట్ ధరించి సోఫాలో కూర్చుని కెమెరాకి క్యూట్ స్మైల్ తో ఫోజులిచ్చింది. మెడలో మంగళ సూత్రం టూస్మార్ట్ గా ఈ ఫోటోలో హైలైట్ గా కనిపిస్తోంది. సాధారణంగా హీరోయిన్లు పెళ్లైన తర్వాత మంగళ సూత్రాలు మెడలో ఉంచుకోవడం చూసేది అరుదు. మంగళ సూత్రాలు ఉన్నా కానీ అవి బయటకు కనిపించకుండా.. మెడలో డిజైనర్ జ్యూవెలరీతోనే కెమెరాకి ఫోజులివ్వడం చూసేదే. పర్సనల్ ఫోటో షెషన్ అయినా..వృత్తిగతమైనది అయినా. కానీ ఇక్కడ కత్రినా ఇవేవీ కేర్ చేయలేదు. మంగళ సూత్రం రహస్యంగా ఉంచలేదు. సూటిగా లైవ్ లీగా ఫోటో రూపంలో ట్రెడిషన్ ని గౌరవిస్తూ ఇలా ఇన్ స్టాలో షేర్ చేసింది.
దీనర్థం.. క్యాట్ వివాహ బంధానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి సంకేతమిదని చెప్పొచ్చు. మెడలో పసుపు తాడుని పలుపు తాడుగా భావించే కొందరు మోడ్రన్ గాళ్స్ మల్లీశ్వరిని ఆదర్శంగా తీసుకోవచ్చు. అంత పెద్ద సెలబ్రిటీ హీరోయిన్ అయినా సంప్రదాయాల్ని గౌరవించి ముందుకెళ్లడం హర్షించదగినది అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. వివాహ బంధానికి కత్రిన ఎంతో విలువనివ్వడం నేటితరానికి ఒక స్ఫూర్తి. ఇక నటిగా కత్రినా శిఖరాగ్రాన్ని చేరుకుంది. వేనోళ్ల కీర్తించబడింది. ఇప్పటికీ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్ లు క్యూ లైన్ లో ఉన్నాయి. త్వరలోనే ఇండియన్ సూపర్ గాళ్ గా అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరీలో తెలుగు ఆడియెన్ కి ట్రీటిస్తుందని సమాచారం. హ్యాట్సాఫ్ టు కత్రిన అలియాస్ మల్లీశ్వరి.