Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మినిమమ్ మేకప్ మ్యాగ్జిమం బ్యూటీ

By:  Tupaki Desk   |   13 March 2019 11:35 AM GMT
ఫోటో స్టొరీ: మినిమమ్ మేకప్ మ్యాగ్జిమం బ్యూటీ
X
కత్రినా కైఫ్ జస్ట్ బాలీవుడ్ బ్యూటీనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం ఉన్న హీరోయినే. కత్రినా తన కెరీర్ ప్రారంభంలోనే వెంకటేష్ సినిమా 'మల్లీశ్వరి'(2003) నందమూరి బాలకృష్ణ చిత్రం 'అల్లరిపిడుగు'(2005) లో హీరోయిన్ గా నటించింది. నిజానికి అప్పట్లో కత్రినా స్టార్ హీరోయిన్ ఏమీ కాదు. నటన విషయం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తర్వాత కాలంలో ఎంతో శ్రమించి.. తనను తాను మెరుగుపరుచుకొని టాప్ లీగ్ హీరోయిన్ గా మారింది.

నటన విషయంలో ఇప్పటికీ కొంతమంది ఆడియన్స్ కత్రినాకు ఫుల్ మార్క్స్ వెయ్యరు గ్లామర్ విషయంలో మాత్రం ఫుల్ మార్క్స్ ఇచ్చేయాల్సిందే. ఇక డ్యాన్స్ విషయానికి వస్తే కత్రీనా ను బీట్ చేసే హీరోయిన్లు బాలీవుడ్ లో చాలా తక్కువమంది హీరోయిన్లు ఉన్నారు.. 'ధూమ్ 3' సినిమాలో 'కమ్లీ' లాంటి చార్ట్ బస్టర్ డ్యాన్స్ సాంగ్స్ కత్రినా కెరీర్ లో కనీసం అరడజను ఉన్నాయి. ఈ రేంజ్ టాలెంట్ ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ భారీగానే ఉంటుంది కదా. కత్రినాకు ఇన్స్టాలో 19 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. రెగ్యులర్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది కత్రినా.

రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. బ్లాక్ చుక్కలున్న వైట్ కలర్ గౌన్లో ఒక బెంచ్ పై స్టైల్ గా రాకుమారిలా కూర్చుంది. గాజులమాదిరిగా ఉన్న వెడల్పాటి ఇయర్ రింగ్స్ తప్ప మరే ఇతర యాక్సెసరీస్ దరించలేదు. లూజ్ హెయిర్ తో మినిమమ్ మేకప్ తో పోజిచ్చినా అందాల బొమ్మలా ఉంది. ఇంటర్నేషనల్ బ్యూటీ కదా.. ఎంతో సహజంగా.. ఎబ్బెట్టుగా లేకుండా క్లీవేజ్ షో కూడా చెసేసింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన 15 గంటలలోనే 8 లక్షల లైకులు వచ్చాయి. అంటే నెటిజనుల హృదయ వీణను కేట్ సుతిమెత్తగా మీటినట్టేగా? ఈ పొడవు కాళ్ళ సుందరి ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'భరత్' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది ఈద్ సందర్భం గా జూన్ 5 న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.