Begin typing your search above and press return to search.

రోజుకోటి చూపిస్తే తట్టుకోవద్దా కేట్

By:  Tupaki Desk   |   27 Nov 2016 11:30 AM GMT
రోజుకోటి చూపిస్తే తట్టుకోవద్దా కేట్
X
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. నిన్నంటే నిన్నే మాల్దీవ్స్ నుంచి ఓ ఫోటో నెట్ లో పెట్టింది. డ్రస్ అంతా విండోస్ టైపులో డిజైన్ చేసిన వైట్ కలర్ బాడీ సూట్ వేసుకుని.. బీచ్ ఒడ్డున నుంచుని అందాలు ఆరబోసేసిన ఫోటో.. అభిమానుల్లో సెగలు రేపేసింది.

ఈ రేంజ్ గ్లామర్ డోస్ ను ఇంకా జీర్ణించుకోక ముందే.. మాల్దీవ్స్ నుంచి మరో కొత్త పిక్చర్ సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి మాల్దీవ్స్ వెళ్లిన ఈ బ్యూటీ.. మనీష్ కుర్చీపై కూచుని.. బాగా సన్నిహితంగా ఓ ఫోటోకు పోజ్ ఇచ్చింది. బ్లాక్ టాప్ లో అమ్మడి క్లీవేజ్ అందాలు మిలమిలా మెరుస్తున్నా.. అంతకంటే ఎక్కువగా కాలి సోకులు కనిపించేస్తున్నాయి. కత్తిలాంటి అందాలన్నీ తనలో దాచుకున్న కత్రినా.. ఇన్నేసి షోకులను వరుసగా చూపించేస్తుండడంతో.. నెటిజన్లకు ఊఫిర కూడా ఆడ్డం లేదు.

ఈ హాట్ పిక్ ను పోస్ట్ చేసిన మనీష్ మల్హోత్రా.. 'రోజంతా షూట్ చేశాక రాత్రి ఫన్నీగా ఇచ్చిన పోజ్. మాల్దీవ్స్ లో బజార్ బ్రైడ్ కోసం అందాల భామ కత్రినాతో' అంటూ పోస్ట్ చేశాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/