Begin typing your search above and press return to search.

పెళ్ల‌యినా క‌త్రిన‌తో భాయ్ నీకిది త‌గునా?

By:  Tupaki Desk   |   29 Oct 2022 4:41 AM GMT
పెళ్ల‌యినా క‌త్రిన‌తో భాయ్ నీకిది త‌గునా?
X
బిగ్ బాస్ హిందీ ఇప్ప‌టికే 15 సీజ‌న్లు అద్భుత విజ‌యం సాధించ‌డంతో సీజ‌న్ 16 అంతే గ్రాండ్ గా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్ దీనికి హోస్టో. బిగ్ బాస్ 16: గేమ్ బద్లేగా,.. క్యుంకీ బిగ్ బాస్ ఖుద్ ఖేలేగా! అంటూ..హిందీ రియాలిటీ TV సిరీస్ బిగ్ బాస్ పదహారవ సీజన్ వైభ‌వంగా కొన‌సాగుతోంది. 1 అక్టోబర్ 2022 నుండి కలర్స్ TVలో ప్రీమియర్ అవుతోంది. సల్మాన్ ఖాన్ పదమూడవ సారి ఈ షోను హోస్టింగ్ చేస్తున్నారు.

మొట్టమొదటిసారిగా శేఖర్ సుమన్ తో ఒక కొత్త విభాగం-బిగ్ బులెటిన్ అంటూ సండే షోకి శేఖర్ సుమన్ హోస్ట్ చేసారు. వీకెండ్ కా వార్ ... అవి- శుక్రవర్ అండ్ శనివర్ క వార్ .. మునుపటి సీజన్ ల త‌ర‌హాలో శని - ఆదివారాలకు బదులుగా శుక్రవారాలు -శనివారాలలో ప్రసారమ‌వుతున్నాయి. మొట్టమొదటిసారిగా హౌస్ నుంచి మెంబ‌ర్ 'తొలగింపు' ఆదివారం కాకుండా శనివారాల్లో జరిగింది.

దేశంలోనే అతిపెద్ద స్టార్లలో సల్మాన్ ఖాన్ ఈ షోని విజ‌య‌వంతంగా న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అతను దశాబ్ద కాలంగా హిందీలో బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం 16వ సీజన్ రంజుగా జరుగుతోంది.

ఈసారి వారాంతపు ఎపిసోడ్ లో కత్రినా కైఫ్ తో స‌ల్మాన్ భాయ్ స్పెష‌ల్ ట్రీట్ ప్లాన్ చేశాడ‌ని చేయ‌డం ఆసక్తిని క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే ప్రోమో విడుద‌లై ఆక‌ట్టుకుంది. మాజీ ప్రేయ‌సితో భాయ్ స్ప‌ష‌ల్ ఎపిసోడ్ గా ఇది అల‌రించ‌నుంది.

త్వరలో విడుదల కానున్న తన కొత్త చిత్రం 'ఫోన్ బూత్' ను ప్రమోట్ చేయడానికి కత్రినా కైఫ్ ఈ షోకి అతిథిగా విచ్చేసింది. ప్రోమోలో క్యాట్ -సల్మాన్ ఎప్ప‌టిలానే కులాసాగా గడిపారు. 'టిప్ టిప్ బర్సా పానీ...' పాటకు డ్యాన్స్ లు చేస్తున్నారు. సల్మాన్ - కత్రినా కొన్నేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు.

కానీ ఆ త‌ర్వాత బ్రేక‌ప్ అయ్యింది. కొంత‌కాలం పాటు ర‌ణ‌బీర్ తో క‌త్రిన ఎఫైర్ హాట్ టాపిక్ అయ్యింది. కానీ ఆ బంధం కూడా బ్రేక్ అయ్యింది. ఇప్పుడు క్యాట్ మ‌రో యంగ్ ట్యాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్నారు. ఈ జంట త్వ‌ర‌లో ఒక కొత్త అతిథిని త‌మ ఇంటికి ఆహ్వానిస్తున్నార‌ని గుస‌గుసలు ఉన్నా అధికారికంగా క‌న్ఫామ్ కావాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి మాజీ ప్రియురాలితో క‌లిసి స‌ల్మాన్ బిగ్ బాస్ 16 ఎపిసోడ్ ని రంజుగా ప‌సందుగా సిద్ధం చేసారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.