Begin typing your search above and press return to search.

అతడితో కత్రినా పెళ్లి ఫిక్స్.. ఆ మూడు డేట్లలో ఒకటి ఖాయమట

By:  Tupaki Desk   |   5 Nov 2021 4:15 AM GMT
అతడితో కత్రినా పెళ్లి ఫిక్స్.. ఆ మూడు డేట్లలో ఒకటి ఖాయమట
X
ఒకరి తర్వాత ఒకరు చొప్పున బాలీవుడ్.. టాలీవుడ్ సినీ ప్రముఖులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. గడిచిన కొంతకాలంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ దివా కత్రినా కైఫ్ పెళ్లికి సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. తన కంటే జూనియర్.. వయసులో చిన్నవాడైన తాజా బాలీవుడ్ సంచలనం విక్కీ కౌశల్ ను ఆమె పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు. తన కంటే ఐదేళ్లు చిన్నవాడైన విక్కీని ఆమె పెళ్లాడేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ గడిచిన కొన్ని నెలలుగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉండటం తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని వీరిద్దరూ వెల్లడించకున్నా.. వారికి సంబంధించి బయటకు వస్తున్న ఫోటోలు.. ఇతర వార్తలు.. వారి మధ్యనున్న బంధాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం చూస్తే.. కత్రినా.. విక్కీ కౌశల్ వివాహం వచ్చే నెల 7..8..9 తేదీల్లో ఏదో ఒక రోజున జరుగుతుందని చెబుతున్నారు. ఈ వేడుకకు రాజస్థాన్ వేదిక కానున్నట్లు చెబుతున్నారు.ఈ వివాహ వేడుకకు బాలీవుడ్.. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లుగా చెబుతున్నారు.

రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్కోటలో వీరి పెళ్లి జరుగుతుందని.. ఇది రాంథమ్ బోర్ నేషనల్ పార్కుకు 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. వీరిద్దరూ కలిసి జరుపుకున్న 2021 న్యూఇయర్ పార్టీకి సంబంధించిన ఫోటోలు బయటకురావటంతో పాటు..ఇద్దరికి ఒకేసారి కరోనా సోకటంతోనూ వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందన్న అనుమానం అంతకంతకూ బలపడింది. దీనికి తోడు కత్రినా.. విక్కీలు రిలేషన్ లో ఉన్నట్లుగా టీవీ షోలో సోనమ్ కపూర్ సోదరుడు కమ్ నటుడు హర్షవర్దన్ కపూర్ వెల్లడించటం తెలిసిందే. మొత్తానికి మరో బాలీవుడ్ జంట ఒక ఇంటివారు కాబోతున్నారన్న మాట.