Begin typing your search above and press return to search.

ఇన్నేళ్లూ ఈ ఆరబోతను ఆపిందెవరు?

By:  Tupaki Desk   |   3 May 2017 5:32 PM GMT
ఇన్నేళ్లూ ఈ ఆరబోతను ఆపిందెవరు?
X
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. టాప్ రేంజ్ కు దూసుకెళ్లిపోయిన మాట నిజమే అయినా.. ఈ మధ్య వెనకబడిపోయిందనే మాట వాస్తవమే. ఇటు పర్సనల్ లైఫ్ లో రణబీర్ కపూర్ తో బ్రేకప్ అయిపోవడం.. అటు వరుసగా సినిమాలు డింకీ కొట్టేయడం కేట్ ని బాగానే డిస్టర్బ్ చేశాయి. కానీ అంతకంటే వేగంగా దూసుకొచ్చేందుకు కత్రినా కరెక్ట్ రూట్ లోకే వచ్చేసినట్లుంది.

వోగ్ మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కోసం ఈ మల్లీశ్వరి ఆరేసిన అందాలు మామూలుగా లేవు. ఈ సుందరికి ఎక్స్ పోజింగ్ చేయడం కొత్తేమీ కాదు కానీ.. ఇప్పుడు మరీ జోరు పెంచేయడమే కాదు.. టాప్ గేర్ లోకి కూడా వెళ్లిపోయింది. వోగ్ కోసం చేసిన ఫోటోషూట్ లో ఒక పోజ్ అయితే.. అందిరికీ మైండ్ బ్లాంక్ చేసేయడం ఖాయం. బ్లాక్ షర్ట్.. బాటమ్ తో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కనిపించిన కేట్.. ఏకంగా షర్ట్(టాప్)కి ఉన్న బటన్స్ ను ఓపెన్ చేసేసి.. సోయగాలను కెమేరా ముందు పెట్టేసింది. ఇంతలేసి అందాలను ఈ స్థాయిలో కత్తిలాంటి అందాలను ప్రదర్శిచండం ఈమెకు ఇదే తొలిసారి.

మరి ఇన్నేళ్లూ ఇలాంటి ఎక్స్ పోజింగ్ చేస్తూ ఏనాడూ కనిపించలేదు కత్రిన. ఇప్పటివరకూ రణబీర్ తో ప్రేమాయణం కారణంగానే కొన్ని హద్దులు పాటించిందని.. ఇప్పుడు సరిహద్దులు చెరిపేయడమే కాదు.. షర్ట్ బటన్స్ ను కూడా వదిలేసేంతగా తెగించేసిందన్నది బాలీవుడ్ గుసగుస.