Begin typing your search above and press return to search.

కత్రినా ఎప్పుడూ కత్రినానే అందంలో!

By:  Tupaki Desk   |   6 April 2020 9:30 AM GMT
కత్రినా ఎప్పుడూ కత్రినానే అందంలో!
X
హీరోయిన్లు చాలామందే ఉంటారు కానీ ఎవర్ గ్రీన్ బ్యూటీలు మాత్రం కొందరే. సీనియర్ బాలీవుడ్ బ్యూటీ అయిన కత్రినా కైఫ్ కూడా ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీల కేటగిరిలోనే ఉంటుంది. బాలీవుడ్ లో 15 ఏళ్ళ పాటు హీరోయిన్ గా కొనసాగడం అంత సులువైన విషయం కాదు.. ఇక స్టార్ హీరోయిన్ గా కొనసాగడం మరీ కష్టమైన పని. కానీ అలాంటి పనిని ఎంతో సులువుగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న భామ కత్రినా.

నిన్న రాత్రి 9 గంటలకు దేశంలో మెజారిటీ ప్రజలందరూ పీఎం మోడీ గారి పిలుపు మేరకు తొమ్మిది నిముషాల పాటు ఇంట్లో లైట్లు ఆపేసి బయటకు వచ్చి దీపాలు వెలిగించారు. కొందరు కొవ్వొత్తులు వెలిగిస్తే.. కొందరు ఫోన్ టార్చ్ లు ఆన్ చేసి కరోనావైరస్ పై పోరాటానికి తామంతా సన్నద్ధంగా ఉన్నామని.. కలిసికట్టుగా ఆ మహమ్మారిని ఎదుర్కొంటామనే సందేశం ఇచ్చారు. బ్యూటిఫుల్ కత్రినా కూడా అందరిలాగే తన బాల్కనీలో కొవ్వొత్తులను వెలిగించింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ "వెలుతురు లేకుండా దారులు మూసుకు పోయినప్పుడు ఆ చీకటి లో ఇది మీకు వెలుతురు కావాలి" అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చింది.

వైట్ డ్రెస్ ధరించిన కత్రినా ఆ కొవ్వొత్తుల కాంతిలో చుక్కల్లో చందమామలా మెరిసి పోతోంది. చాలామంది హీరోయిన్లు సమయం సందర్భం లేకుండా హాట్ డ్రెస్సులు ధరించి మోటుగా ప్రవర్తిస్తుంటారు. కానీ కత్రినా మాత్రం సందర్భానికి తగ్గట్టు వస్త్రధారణతో అందరినీ మెప్పిస్తుంది. ఇదో ట్రెడిషనల్ ఈవెంట్ లాంటిది కాబట్టి హాటులు.. ఘాటులు పక్కనబెట్టి ఓ సింపుల్ టాప్ ధరించి మరీ ఫోటోకు పోజిచ్చింది. అందంలో.. గ్రేస్ లో కత్రినాకు సాటిలేదని నిరూపించింది. ఇక సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ తో నటించిన 'సూర్యవంశి' రిలీజుకు సిద్ధంగా ఉంది.