Begin typing your search above and press return to search.

ఫారినర్ తో కత్రినా పెళ్ళి తప్పదేమో

By:  Tupaki Desk   |   14 Jun 2016 4:38 AM GMT
ఫారినర్ తో కత్రినా పెళ్ళి తప్పదేమో
X
లండన్ నుంచి వచ్చి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయిన బ్యూటీ కత్రినా కైఫ్. ఇక్కడ పర్మనెంట్ గా పాగా వేసేసేందుకు మంచి స్కెచ్ నే వేసిందీ భామ. ఇక రణ్ బీర్ కపూర్ తో పెళ్లి ఫిక్స్ అయిపోవడమే.. పప్పన్నానికి(నార్త్ లో వేరే వండుతార్లెండి) రెడీ అయిపోవడమే అనుకుంటున్న టైమ్.. ఆ యంగ్ హీరో ఝలక్ ఇచ్చేశాడు. నిజానికి అసలు రణ్ బీర్ కి కత్రినాకి మధ్య ఉన్న గొడవేంటో కూడా ఎవరికీ తెలీదు.

గాఢంగా ప్రేమించిన ప్రేమికుడు ఎప్పటికైనా తిరిగొస్తాడని.. బాగానే ఎదురుచూసింది కేట్. మధ్యలో పాత ప్రియుడు సల్మాన్ కు దగ్గరవుతున్నట్లు నటించి.. ఉడికించే ఎటెంప్ట్ కూడా చేసింది. అయితే.. ఇవేవీ వర్కవుట్ కాకపోవడంతో.. ఇప్పుడు తన పెళ్లి సంగతి తానే చూసుకోవాలనే ఫైనల్ డెసిషన్ కి వచ్చేసిందట బాలీవుడ్‌ బార్బీ. అందుకే ఇప్పుడు కత్రినా కైఫ్‌ కి త్వరలో పెళ్లి చేసేసేందుకు ట్రై చేస్తోంది తల్లి సూజన్‌.

ఇప్పటికే గతంలో రణ్ బీర్ కపూర్ తో కలిసి సహజీవనం చేసిన ఫ్లాట్ ను కూడా ఖాళీ చేసేసిన కత్రినా.. ఎవరికి వారే అని పాటలు పాడేసుకుంటోంది. ప్రస్తుతం రణ్ బీర్ - కత్రినాలు కలిసి నటిస్తున్న సినిమా జగ్గా జాసూస్ కోసం అయితే.. దర్శకనిర్మాతలకు చుక్కలు చూపించేస్తున్నారు. ఈ సిట్యుయేషన్ నుంచి బైట పడాలంటే.. త్వరగా కేట్ కి పెళ్లి చేయడమే రైట్ అని భావించిన తల్లి సూజన్.. ప్రస్తుతం ఓ లండన్ మొగుడిని వెతికే పనిలో పడింది. యూరోప్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి వెలిగిపోతున్న లిస్ట్ లో తాను చేరదామనుకున్న కత్రినా కైఫ్ కి.. చివరకు మళ్లీ అక్కడి భర్తనే చేసుకోవాల్సి వస్తోందంటూ బాలీవుడ్ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.